రక్షకుని కోసం విప్లవాత్మక దళం
“ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను. వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలు వేసిరి”. (మత్తయి 8:28, 29)
ఇక్కడ దయ్యములు ఒక రహస్యాన్ని నేర్చుకున్నాయి. దయ్యాలు నాశనానికి గురైనాయని వాటికి తెలుసు. దేవుని కుమారుడు జయించినవాడని వాటికి తెలుసు. అయితే, తుది ఓటమి జరిగే సమయానికి ముందుగానే క్రీస్తు వస్తున్నాడన్నది జరిగేంతవరకు వాటికి తెలియదు.
క్రీస్తు తన దళాలను పోరాటానికి నడిపించడానికి యుద్ధం ముగిసే వరకు వేచి ఉండడు. సాతాను భూభాగాలన్నిటిలోనికి ఆయన తన విప్లవాత్మక దళాన్ని నడపించడం ప్రారంభించాడు. సాహసోపేతమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ఆయన “లైఫ్-స్క్వాడ్ (జీవితాలను రక్షించే దళాన్ని)”ని తర్ఫీదు చేశాడు. అంతిమ వ్యూహాత్మకమైన విజయ సమయానికి ముందుగానే క్రీస్తు అనేకమైన వ్యూహాత్మక విజయాలను ప్రణాళిక వేసి ఉంచాడు.
తత్వలితంగా యుద్ధకాల మనస్తత్వం ఇది: సాతాను నాశనం ఖచ్చితమైనందున ఈ విషయం వానికి బాగా తెలుసు, సాతానును వెంబడించాలని వాడు మనల్ని శోధించినప్పుడు వాని గురించిన ఈ సత్యాన్ని మనం వానికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. “నువ్వు మతి చెడినవాడివి. ఓడిపోయినవాని దండులోనికి ఎవరు చేరుతారు?!” అని మనం నవ్వుతూ వానితో చెప్పవచ్చు.
“ఈ యుగ సంబంధమైన దేవతకు” (2 కొరింథీ 4:4) సంఘం అనేది స్వాతంత్ర్యం పొందిన శత్రువు. మనమందరం పోరాట వీరులం మరియు పురికొల్పు వారముగా ఉన్నాము. “వాయు మండల సంబంధమైన అధిపతి” (ఎఫెసీ 2:2) యొక్క తిరుగుబాటు సామ్రాజ్యానికి మనం తిరుగుబాటుదారులం (ఎఫెసీ 2:2).
ఇది సురక్షితం కాదు గాని ఇది ఉత్తేజకరంగా ఉంటుంది. ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. మనం చేసేటువంటి విప్లవాత్మక కార్యకలాపాల కోసం సాతాను శక్తులు ఎల్లప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాయి. మరణంతో పోరాడువారందరికి పునరుత్థానం కలుగుతుందని క్రీస్తు వాగ్దానం చేశాడు. అయితే, ఆదరణ, లేక లోకము నుండి అంగీకారం, లేక శత్రువున్న ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటి వాటిని ఆయన మనకు హామి ఇవ్వలేదు.
కమాండర్ (సేనాధిపతి) కోసం చాలామంది తమ జీవితాలను సంతోషంగా వదులుకున్నారు. చనిపోవడానికికైనా, బ్రతకడానికైనా ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదని నేననుకుంటున్నాను!
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web