మీ హృదయపు కిటకీలను తెరవండి

షేర్ చెయ్యండి:

“నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును”. (యెషయా 42:3)

యెషయా 42:1-3 వచనాలలో ఉన్న ప్రవచనపు మాటలు, గత కొన్ని వారాలలో నేను విన్న అత్యంత ప్రోత్సాహకరమైన మాటలు. ఈ వచనాలు యేసు తన ఆధ్యాత్మిక అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడనే దాని గురించి మాట్లాడతాయి.

మీరు “నలిగిన రెల్లులా” ఉన్నారా? అంటే చెట్టు కాండం తెంపబడి, పువ్వులన్నీ నేలకు రాలి, ఎటువంటి సత్తువను పొందని పెద్ద పెద్ద లిల్లీ పువ్వులలో ఒకదానిలా ఉన్నారా? మీ విశ్వాసం కేవలం ఒక చిన్న అగ్గి రవ్వే గాని, ఒక జ్వాల కాదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ విశ్వాసం, మీరు బర్త్ డే క్యాండిల్ ఊదిన తర్వాత క్యాండిల్ చివరి భాగాన కనిపించే ఎర్రటి రవ్వలా ఉందని మీరు ఎప్పుడైనా భావించారా?

ధైర్యం తెచ్చుకోండి! క్రీస్తు ఆత్మ ప్రోత్సహించే ఆత్మ: ఆయన మీ పువ్వును తెంపి పడెయ్యడు; మీ నిప్పు రవ్వను ఆర్పివేయడు.

“ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను” (లూకా 4:18). “అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును” (మలాకీ 4:2). “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” (మత్తయి 11:29). యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము” (కీర్తన 27:14).

అగ్ని జ్వాలలుగా ఉండాల్సింది పోయి, చిన్న నిప్పు రవ్వలుగా ఉండడమనేది మనకు బాధను కలిగించవచ్చు. అయితే, ఈ మాటలు వినండి! ప్రోత్సహించబడండి: అవును, చిన్న నిప్పు రవ్వగా ఉండటానికి, అగ్ని జ్వాలగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే, ఒక చిన్న నిప్పు రవ్వకు మరియు అసలు నిప్పే లేని కర్రకు చాలా వ్యత్యాసం ఉంది! విశ్వాసం లేకుండా ఉండడానికి బదులుగా, ఆవగింజంత విశ్వాసం కలిగియుండడం అనేది, కొండంత విశ్వాసం కలిగియున్నట్లుగానే ఉంటుంది.

దేవుని వాగ్దానాల కిటకీని తెరవండి మరియు మీ హృదయంలోని ప్రతి గదిలోనికి ఆత్మ దేవుణ్ణి ఆహ్వానించండి. దేవుని పరిశుద్ధమైన గాలి మిమ్మును విరిచివేయదు లేక అణచివేయదు. ఆయన మీ తలను ఎత్తుతాడు, మీ చిన్న నిప్పు రవ్వను గొప్ప అగ్ని జ్వాలలుగా రగిలిస్తాడు. ఆయన ప్రోత్సహించు ఆత్మయైయున్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...