కొంచెం కాలం మాత్రమే

కొంచెం కాలం మాత్రమే

షేర్ చెయ్యండి:

తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బల పరచును.” (1 పేతురు 5:10)

రోజువారి  జీవితంలో ఉండే సాధారణ ఒత్తిళ్ళు కష్టాల మధ్యన కొన్నిసార్లు, “ఇంకా ఎంత కాలం ప్రభువా? ఈ బాధ భరించలేను. రేపు ఎటువంటి కష్టం వస్తుందో? ఆ కష్టంలోనూ, నీవు తోడుగా ఉంటావు కదా?” అని మనం మొర పెడుతుంటాం.

ఈ ప్రశ్న చాలా అత్యవసరమైనది, ఎందుకంటే, “నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును” (మార్కు 13:13) అని యేసు చెప్పాడు. 

అయితే, “నశించుటకు వెనుక తీసి, నశించిపోయే” (హెబ్రీ 10:39) వారి మధ్యలో ఉన్నామనే ఆలోచనే మనకు వణుకుతెప్పిస్తుంది. ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. రాబోయే దేవుని రాజ్యంలో శ్రమ ఒకని విశ్వాసానికి గొప్ప ముప్పుగా ఉంటుంది. 

అందుచేత, “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును” (1 పేతురు 5:10) అని శ్రమలవలన వేసారిపోయిన క్రైస్తవులకు పేతురు గారు ఇస్తున్న వాగ్దానం వినడానికి అద్భుతమైన సందేశముగా ఉన్నది.

మన సహనానికి మించి దేవుడు మనలను పరీక్షించడని అంటే మన శ్రమలో ఆయన ఆలస్యం చేయడని, మన దుఃఖమంతటిని ఆయన తీసివేస్తాడని, ఎప్పటునుండో అస్థిరంగా ఉన్నదానిని శాశ్వతంగా స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ హామీ “సర్వ కృపా” నిధియగు దేవుని నుండి మనకు ఇవ్వబడుతుంది.  

దేవుని కృప గత కాలంలో ఇచ్చేసిన కొంత కృప లాంటిది కాదు. ఆయన “సర్వ కృపా నిధియగు దేవుడు,”  ఈ కృపలో మన భవిష్యత్తుకు సంబంధించిన, మనం అంతం వరకు సహించగల కృప యొక్క అనంతమైన, తరగని నిధులు ఉన్నాయి.  

గతంలో పొందిన కృప వలన బలపరచబడి భవిష్యత్తు కృపలో ఉంచిన విశ్వాసమనేది, ఇరుకైన మరియు కష్టమైన మార్గములో సహిస్తూ నిత్యజీవానికి నడిపించే అతి ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...