ఈరోజు కొరకు దయ

ఈరోజు కొరకు దయ

షేర్ చెయ్యండి:

“యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు”. (విలాపములు 3:22–23)

దేవుని దయ ప్రతి ఉదయం నూతనమైనది ఎందుకంటే ప్రతి రోజు ఆ రోజుకు సరిపడా దయ మాత్రమే ఉంటుంది. దేవుడు ప్రతిరోజు కష్టాలను నియమిస్తాడు. అలాగే దేవుడు ప్రతి రోజు దయను కూడా  నియమిస్తాడు. ఆయన పిల్లల జీవితంలో, అవి ఖచ్చితంగా నియమించబడ్డాయి. “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” అని యేసు మత్తయి 6:34లో చెప్పారు. ఏనాటి కీడు ఆనాటికి ఉంటుంది. ఏనాటి దయ ఆనాటికి ఉంటుంది. అనుదినము ఈ దయ నూతనంగా ఉంటుంది.

కానీ ఈ రోజే రేపటి భారాన్ని మోయాల్సి వస్తుందని భావించినప్పుడు మనం తరచుగా నిరాశ చెందుతాము. మనం ఒక విషయం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు: నేటి కష్టాలకు నేటి దయలు. రేపటి కష్టాలకు రేపటి దయ.

భయంకరమైన పరీక్షలో నిలబడే దయ మనకు ఉంటుందా అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాము. అవును, మనము నిలబడతాం. పేతురు ఇలా అంటున్నాడు, “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమా స్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.” (1 పేతురు 4:14). దూషణ వచ్చినప్పుడు, మహిమ గల ఆత్మ వస్తాడు. స్తెఫెనును రాళ్లతో కొడుతున్నపుడు అదే జరిగింది. ఇది మీకు జరుగుతుంది. ఆత్మ మరియు మహిమ అవసరమైనప్పుడు, పొందుకొంటాము.

అరణ్యంలో ఉన్నప్పుడు మన్నా ఏ రోజుకారోజు ఇవ్వబడింది. అక్కడ నిల్వ లేదు. ఆ విధంగా మనం దేవుని దయపై ఆధారపడాలి. రేపటి భారాలను భరించే శక్తి ఈరోజు మీకు లభించదు. నేటి కష్టాలకు ఈ రోజు మీకు దయ ఇవ్వబడింది. రేపటికి దయాదాక్షిణ్యాలు కొత్తగా ఉంటాయి. “మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు” (1 కొరింథీయులు 1:9).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...