యేసు ఖచ్చితంగా మిషన్ పూర్తి చేస్తాడు

షేర్ చెయ్యండి:

“మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును”. (మత్తయి. 24:14)

యేసు నోట నుండి వచ్చిన ఈ మాటకంటే స్ఫూర్తి మిషనరీ వాగ్దానం మరొకటి నాకు తెలియదు.

ఇక్కడ పై వచనంలో ఈ సువార్త ప్రకటించబడాలి అని గాని, ఈ సువార్త ప్రకటించబడవచ్చు అని గాని చెప్పబడలేదు. అయితే, ఈ సువార్త ప్రకటించబడును అని చెప్పబడింది.

ఇది గొప్ప ఆదేశం కాదు, లేక గొప్ప ఆజ్ఞ కాదు. ఇది గొప్ప నిర్దిష్టత, గొప్ప నిశ్చయత.

అలా మాట్లాడటానికి ఎవరు ధైర్యం చేయగలరు? అది జరుగుతుందని ఆయనకి ఎలా తెలుసు? సంఘానికి అప్పగించబడిన మిషనరీ పనిలో విఫలమవ్వదని ఆయనకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?

జవాబు: మిషనరీ సేవకు సంబంధించిన కృప అనేది, ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించాలన్న కృప ఎంత అనివార్యమైనదో అంతే అనివార్యమైనది. క్రీస్తు సార్వభౌమాధికారి కాబట్టి ఆయన సార్వత్రిక ప్రకటనకు సంబంధించిన వాగ్దానం చేయగలడు. ఆయన భవిష్యత్తును నిర్మించువాడు కాబట్టి మిషన్ కార్యాలకు సంబంధించిన భవిష్యత్తు విజయం గురించి ఆయనకు బాగా తెలుసు. సమస్త దేశాలు ఖచ్చితంగా సువార్తను వింటాయి!

“దేశం” అంటే ఆధునిక “దేశం” కాదు. దేశాల్ని గురించి పాత నిబంధనలో మాట్లాడినప్పుడు, అది యెబూసీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, అమోరీయులు, మోయాబీయులు, కనానీయులు, ఫిలిష్తీయులను గురించి సూచించేది. “దేశాలు” అనేవి తమదైన ప్రత్యేకమైన భాషను, సంస్కృతిని కలిగి ఉండే నిర్దిష్టమైన జాతి సమూహాలు. “సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి!” కీర్తన 117:1. దేశములంటే సర్వ జనములు, అంటే ప్రజల సమూహాలని మనం వారిని పిలుస్తాం.

దేవుని సార్వభౌమాధికారము గల కుమారుడిగా మరియు సంఘానికి ప్రభువుగా, యేసు కేవలం ఈ దైవిక ఉద్దేశాన్ని తీసుకొని, “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” (మత్తయి 24:14) అని సంపూర్ణ నిశ్చయత గల వ్యాఖ్యను చేశాడు.

ప్రపంచ మిషన్లకు కారణమైన ప్రతి కార్యం విజయం పొందుతుందని ఖచ్చితమైన హామి ఇవ్వబడింది. ఇది విఫలమవ్వదు, అలాంటప్పుడు, గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నామని, గొప్ప నిశ్చయతతో మనం వెచ్చిస్తున్నామని, నిశ్చయతతో కూడిన విజయ భావనతో మనం వెళ్తున్నామని చెప్పడం సమంజసం కాదా?

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...