“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైయున్నవి”. (2 కొరింథీ 1:20)
ప్రార్థన అంటే మన జీవితాలలో పదే పదే భూత మరియు భవిష్యత్ కాలాలు అనుసంధానమయ్యే స్థలం. దీన్ని నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వచనంలో పౌలు అద్భుతమైన రీతిగా ప్రార్థనను దేవుని ఆమోదంతో కలుపుతున్నాడు.
2 కొరింథీ 1:20వ వచనంలో, “మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి” అని (అస్పష్టమైన ఆంగ్లంలో నుండి వచ్చే అస్పష్టమైన గ్రీకుతో) పౌలు చెప్తున్నాడు. దీనిని మనం మరింత స్పష్టంగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఆయన ఏమి చెప్తున్నాడో ఇక్కడుంది గమనించండి: “అందుచేత, మనం ప్రార్థన చేసినప్పుడు మనం లెక్కించే వాటి కోసం, మనం అడిగే భవిష్యత్తు కృప కోసం దేవుడు మహిమ పొందుతాడని చూపించడానికి మనం చేసే ప్రార్థనలలో క్రీస్తునుబట్టి మనం దేవునికి ఆమేన్ అని చెప్తాం”.
మన ప్రార్థనల చివరి భాగంలో క్రైస్తవులు ఆమేన్ అని ఎందుకు చెప్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించినట్లయితే, అటువంటి అలువాటు ఎక్కడనుండి వచ్చిందని చెప్పడానికి ఇక్కడ జవాబు ఉంది. ఆమేన్ అనే పదాన్ని ఎటువంటి తర్జుమా లేకుండా హెబ్రీ భాషలో నుండి గ్రీకు, ఇంగ్లిష్, మరియు ఇతర భాషలలోనికి నేరుగా తీసుకోబడింది.
హెబ్రీలో ఈ పదం చాలా బలమైన ధృవీకరణ చేసేటువంటి పదం (సంఖ్యా 5:22; నెహెమ్యా 5:13; 8:6 వచనాలను చూడండి), అంటే ఒక అధికారికంగా, గంభీరంగా, అత్యావశ్యకంగా “నేను అంగీకరిస్తున్నాను,” లేక “చెప్పబడిన ప్రతి మాటకు నేను ఒత్తాసు పలుకుతున్నాను,” లేక “చెప్పబడింది నిజమే,” అని ఒప్పుకుంటున్నాను. “ఆమేన్ ” అంటే దేవునికి ప్రార్థించే సందర్భంలో విన్నవించిన ప్రతి మాటకు ఖచ్చితంగా అవును అని చెప్పడం.
ఇప్పుడు 2 కొరింథీ 1:20 వచనంలోని రెండు భాగాల మధ్యన ఉండే సంబంధాన్ని గమనించండి. మొదటి భాగం, “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి” అని చెప్తోంది. రెండవ భాగం, “మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి” అని చెప్తోంది.
“ఆమేన్ (జరుగునుగాక)” మరియు “అవును” అనే ఈ రెండు పదాలను గమనిస్తే, ఈ రెండు పదాలకు ఒకే అర్థం ఉంది, ఆ వచనం ఏమి చెప్తోందో ఇక్కడ గమనించండి: యేసు క్రీస్తునందు దేవుని వాగ్దానముల ద్వారా దేవుడు మనకు తన అంగీకారాన్ని తెలుపుతున్నాడు; ప్రార్థన ద్వారా క్రీస్తునందు మన నిశ్చయతను దేవునికి మనం తెలుపుతున్నాం.