దేవుని ప్రేమ షరతులతో కూడినదా?

షేర్ చెయ్యండి:

కాదు గాని, ఆయన [దేవుడు] ఎక్కువ కృప నిచ్చును; అందుచేత – దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. (యాకోబు 4:6-8) 

“ఎక్కువ కృప” మరియు దేవుడు మన “యొద్దకు  వచ్చును” అనేవాటికి సంబంధించిన అమూల్యమైన అనుభవం ఉందని యాకోబు భక్తుడు మనకు బోధిస్తున్నాడు. “ఎక్కువ కృప” మరియు దేవుడు మన “యొద్దకు వచ్చును” అనేవి ఖచ్చితంగా అద్భుతమైన అనుభవాలే. అయితే, దేవుని ప్రేమకు సంబంధించిన ఈ అనుభవం షరతులు లేనిదా? అని నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు కాదని నేను చెప్తున్నాను. ఇది మనల్ని మనం తగ్గించుకోవడం మరియు మనం దేవునికి దగ్గరగా వెళ్ళడంపై షరతులతో కూడినది. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు [ఎక్కువ] కృప అనుగ్రహించును…. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును.” 

దేవుని ప్రేమకు స౦బ౦ధి౦చిన అమూల్యమైన అనుభవాలు ఉన్నాయి, దానికి కావలసినవి ఏంటంటే మనం గర్వంతో పోరాడడ౦, తగ్గించుకోవడం, దేవుని దగ్గరకు వెళ్లేందుకు సంతోషపడడం. ఇవే ఆ షరతులు. వాస్తవానికి, ఆ పరిస్థితులే మనలో దేవుడు జరిగించే కార్యం. అయితే, అవి మనం పాటించే షరతులకు తక్కువేమీ కాదు.

ఇది నిజమైతే, దేవుని ప్రేమ షరతులు లేనిది అని ప్రస్తుతం చెప్పే అర్హత లేని మరియు బైబిల్ సంబంధం లేని హామీలు, ప్రజలు తాము తీవ్రంగా కోరుకునే శాంతిని ఆస్వాదించడానికి వారు చేయవలసిన పనులను చేయకుండా ఆపేస్తాయేమోనని నేను భయపడుతున్నాను. “భేషరతుగా (షరతులు లేకుండా)” శాంతిని అనుగ్రహించే ప్రయత్నంలో, మనం ప్రజలను బైబిల్ చూపించే పరిష్కారం నుండి ఎడబాపుతున్నాం.

ఖచ్చితంగా చెప్పాలంటే, మనల్ని ఎన్నుకోవడంలో దైవిక ప్రేమ, క్రీస్తు మరణంలో దైవిక ప్రేమ, మనం రక్షించబడటంలో అంటే మనం తిరిగి జన్మించడంలో దైవిక ప్రేమ అనేవన్నీ పూర్తిగా బేషరతుగా (షరతులు లేకుండా) ఉన్నాయని మనం గట్టిగా, స్పష్టంగా ప్రకటిద్దాం.

మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడటమనేది క్రీస్తు విధేయత మరియు ఆయన చేసిన త్యాగం యొక్క విలువపై ఆధారపడి ఉంది గాని మన మీద ఆధారపడిలేదనే శుభవార్తను నిర్విరామంగా ప్రకటిద్దాం (“ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు” – రోమా 5:19).

అయితే, ప్రతిరోజూ తమ్మును తాము తగ్గించుకొని, దేవుని వద్దకు వచ్చే వారు దేవుని కృప మరియు దేవుని సామీప్యత యొక్క సంపూర్ణమైన మరియు మధురమైన అనుభవాలను అనుభవించి, ఆనందిస్తారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...