ఆలోచనలకు పర్యవసానాలు ఉంటాయి
“ఉపదేశసారం ఏమంటే ప్రేమయే”. (1 తిమోతి 1:5)
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆష్విట్జ్ మరియు డాచౌ నాజీ యొక్క ఏకాగ్రత శిబిరాలలో విక్టర్ ఫ్రాంక్ల్ ఖైదు చేయబడ్డాడు. న్యూరాలజీ మరియు సైకియాట్రీకి సంబంధించిన యూదుల ఆచార్యునిగా ఆయన వ్రాసిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ (Man’s Search for Meaning) అనే పుస్తకం ద్వారా ప్రఖ్యాతి చెందాడు. ఈ పుస్తకం రాత్రికి రాత్రి పది లక్షలకు పైగా అమ్ముడుపొయింది.
ఆ పుస్తకంలో జీవితానికి అర్థాన్ని కనుక్కోవడమే మానవ జీవితానికుండే అత్యంత ప్రాథమిక ఉద్దేశమని తెలియజెప్పే లోగోథెరపీ అని పిలువబడే తన తత్వశాస్త్రం యొక్క సారాన్ని వివరించడం జరిగింది. ఏకాగ్రత శిబిరాల్లోని భయానక పరిస్థితుల్లో తాను పనిచేస్తున్నప్పుడు మనిషి ఈ జీవితంలో “ఎందుకు” అని ప్రశ్న వేసుకోగలిగితే, జీవితం “ఎలా” అనే ప్రశ్నకు తట్టుకోగలడని ఆయన గమనించాడు. కానీ ఇటీవల నన్ను కదిలించిన విషయం ఇదే:
ఆష్విట్జ్, ట్రెబ్లింకా మరియు మైదానెక్ యొక్క గ్యాస్ చాంబర్లు చివరికి బెర్లిన్ లో, ఏదో ఒక పనిలో తయారు చేయబడలేదని, అవి నిహిలిస్టిక్ శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తల ఉపన్యాస మందిరాలలోని డెస్క్ ల వద్ద తయారు చేయబడ్డాయని నేను ఖచ్చితంగా ఒప్పించబడ్డాను. (“విక్టర్ ఫ్రాంక్ల్ ఎట్ నైంటి: ఒక ఇంటర్వ్యూ”, ఇన్ ఫస్ట్ థింగ్స్, ఏప్రిల్ 1995, పేజీ 41).
మరొక విధంగా చెప్పాలంటే, ఆలోచనలకు పర్యవసానాలు ఉంటాయి, ఆలోచనలు కలిగియున్న పర్యవసానాలు ఆశీర్వాదకరమైనవిగానైనా ఉండవచ్చు, లేక విధ్వంసాన్ని సృష్టించేవిగానైనా ఉండవచ్చు. ప్రజల మంచి ప్రవర్తనైనా, చెడు ప్రవర్తనైనా ఎక్కడినుండో రాదు. ఇది మనస్సులో వేళ్ళూనుకొని ఉన్నటువంటి వాస్తవికత యొక్క అభిప్రాయాల నుండి వచ్చి, మంచి చెడుల ప్రవర్తనలను బయటకు తీసుకు వస్తుంది.
ఆలోచనలు ఆచరణాత్మకమైన పరిణామాలను కలిగియున్నాయన్న సత్యాన్ని బైబిల్ స్పష్టంగా చెప్పే ఒకానొక విధానం ఏంటంటే “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి” (రోమా 15:4) అనేటువంటి వాక్యాల ద్వారా తెలియబడడం. లేఖనాలలో ఉన్న ఆలోచనలు నిరీక్షణ అనే ఆచరణాత్మకమైన పర్యవసానమును కలుగజేస్తుంది.
ఉపదేశసారం ఏమంటే ప్రేమయే (1 తిమోతి 1:5) అని మరలా పౌలు చెప్తున్నాడు. “ఉపదేశము” లేక “అధికారం” ద్వారా ఆలోచనలను అందించడమనేది ప్రేమను పుట్టిస్తుంది.
నిరీక్షణ మరియు ప్రేమ అనేవి ఎక్కడినుండో రావు. అవి ఆలోచనలనుండే పెరుగుతాయి, అంటే లేఖనాలలో బయలుపరచిన వాస్తవిక దృక్పథాల నుండే పెరుగుతాయి. .
“కాబట్టి” (NASBలో 1,039 సార్లు ఉపయోగించబడింది) అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఆలోచనలు పర్యవసానాలు కలిగియున్నాయని లేఖనాలు మనకు చూపిస్తున్న మరొక విధానం. “కాబట్టి” అనే పదం ఒక నిర్దిష్టమైన స్థలం నుండి లేక ఒక తర్కము నుండి ఉద్భవిస్తుందని సూచిస్తోంది. ఉదాహరణకు, “కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము” (రోమా 5:1). లేక, “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” (మత్తయి 6:34).
“కాబట్టి” అనే ఈ గొప్ప ఆచరణాత్మకమైన శక్తిలో మనం జీవించాలనుకుంటే, వాటి ముందు ఉండి, వాటి కింద నిలబడగలిగే ఆలోచనలు, లేక వాస్తవికత యొక్క దృక్పథాలను మనం గట్టిగా పట్టుకోవాలి. ఆలోచనలు పర్యవసానాలను కలిగియున్నాయి. కాబట్టి, మన ఆలోచనలన్నిటిని దేవుని వాక్యము యొక్క అధికారం క్రిందకి తీసుకు వద్దాం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web