నేను యేసును విడిచిపెట్టను – కానీ సంఘాన్ని విడిచిపెడతాను
నేటి క్లిప్ ఒక ప్రసంగం నుండి కాకుండా బిసి వాంకోవర్ లోని వెస్ట్ సైడ్ చర్చిలో పాస్టర్ నార్మ్ ఫంక్, జాన్ పైపర్ తో చేసిన ఇంటర్వ్యూ నుండి తీసుకోబడింది. వారు స్థానిక సంఘం గురించి, స్థానిక సంఘాలలో విఫలమైన నాయకుల గురించి మాట్లాడిన సంభాషణలో నుండి ఒక విషయాన్ని చూద్దాం.”నేను యేసును ఎప్పటికీ విడిచిపెట్టను, కానీ కాపరి విఫలమైనట్లు నేను చూశాను కాబట్టి స్థానిక సంఘంతో ఉండాలని కోరుకోవట్లేదు” అని చెప్పే వ్యక్తికి మీరు ఏమి చెబుతారు? ఆ సంభాషణ నుండి చిన్న క్లిప్ ఇక్కడ ఉంచడం జరిగింది.
పాస్టర్ జాన్ గారు, దీనికి మీరు ఏమి చెబుతారు? “నేను యేసును విడిచిపెట్టను కానీ నేను స్థానిక సంఘంతో ఉండాలని కోరుకోవట్లేదు. నాయకత్వం పట్ల నమ్మకాన్ని కోల్పోయాను. ఫలానా నాయకుడిని నేను ఎంతో గౌరవించాను. కాబట్టి నేను యేసు నుండి దూరంగా వెళ్ళను, కానీ వ్యవస్థీకృత సంఘ జీవితానికి సంబంధించిన వాటిలో నేను పాల్గొనను.”
యేసును విడిచిపెట్టుట:
మీరు అలా చేస్తే, యేసుకు దూరంగా నడుస్తున్నట్లే.
కారణం: “నేను యేసును ప్రేమిస్తున్నాను, కాని ఆయన వాక్యానికి లోబడను” అని చెప్పడం అబద్ధం. “ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును” (యోహాను 14:23). సంఘాన్ని స్థాపించింది నేను కాదు యేసు ప్రభువు స్థాపించారు. స్థాపించింది పౌలు కూడా కాదు. యేసు మాత్రమే సంఘమును స్థాపించాడు. ఎఫెసీ 2:20 ప్రకార౦, ఆయన అపొస్తలులను సంఘానికి పునాదిగా ఉంచాడు. ఆ తర్వాత ప్రవక్తలు, ఉపదేశకులు, పాస్టర్లతో కలిసి దీన్ని నిర్మించి, క్రీస్తు శరీరమనే సంఘంలో స్థానిక సంఘముల నిర్మాణం ఉండాలని ఆదేశించాడు.
క్రీస్తు స్థాపించాడు
ఇది మనిషి ఆలోచన కాదు. అధునాతనమైన మరియు ఉదారవాద దృక్పథాల వైపు మొగ్గుచూపే అనేకమంది యువ ఎవాంజెలికల్స్ వ్యవస్థీకృత సంఘమును వేరే దానితో భర్తీచేయగలరని అనుకుంటారు. కాని నేను వారిని అడిగే ప్రశ్న ఇదే: సంఘమును మీరు కడుతున్నారా, కట్టడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు సంఘాన్ని కట్టడానికి ప్రయత్నిస్తుంటే, దానిని బైబిల్ ప్రకారం కట్టండి. వాక్యానుసారమైన సంఘమును ప్రారంభించండి. అంటే మీ ప్రభువును, ఆయన వాక్యాన్ని, ఆయన అపొస్తలుల మాటలను అనుసరించి కట్టడమే.
కాబట్టి సంఘానికి బదులు యేసును ఎన్నుకోవడం అంటే బైబిల్ కంటె మీ సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతను ఇవ్వడం. ఎందుకంటే బైబిల్ ద్వారానే మనం యేసును తెలుసుకుంటాం. మీకు నచ్చిన యేసును మీరు తయారు చేసుకోకూడదు. మీరు నమ్మే యేసు బైబిల్లోని యేసుయైనా అయ్యుండాలి లేదా మీ ఊహల్లోని యేసుయైనా అయ్యుండాలి. బైబిల్లోని యేసును మీరు వెంబడించినట్లైతే, మీరు ఆ యేసును సంపూర్ణంగా అంగీకరించాలి తప్ప సగం సగం కాదు. నిజమైన యేసు తన సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తన సంఘం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web