విపత్తును గూర్చి ఎలా ఆలోచించాలి
“మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగనువరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను. . . . దేవుడు యథార్థవంతుడు.” (2 సమూయేలు 22:5, 31)
ప్రకృతి వైపరీత్యం కారణంగా తన పది మంది పిల్లలను కోల్పోయిన తర్వాత (యోబు 1:19), యోబు ఇలా అన్నాడు, “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతికలుగునుగాక.” (యోబు 1:21). పుస్తకం చివరలో, ప్రేరణ పొందిన రచయిత ఏమి జరిగిందో యోబుకు ఉన్న అవగాహనను ధృవీకరిస్తాడు. అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును “యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధను గూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి” (యోబు 42:11).
ఇది మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది – కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇక్కడ మనకు పాఠాలు – ప్రపంచంలో మరియు మన జీవితాలలో సంభవించే విపత్తుల గురించి మనం ఆలోచించినప్పుడు – డిసెంబర్ 26, 2004 న హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ విపత్తు వంటిది – 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు, 5 లక్షల మంది గాయపడ్డారు మరియు 2,30,000 మంది మరణించారు.
పాఠము #1. సాతాను అంతిమం కాదు; దేవుడు మాత్రమే.
యోబు కష్టాల్లో సాతాను హస్తం ఉంది, కానీ నిర్ణయాత్మక హస్తం కాదు. యోబును బాధపెట్టడానికి దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు (యోబు 1:12; 2:6). కానీ యోబు మరియు ఈ పుస్తక రచయిత ఇద్దరూ కూడా దేవుడే నిర్ణయాత్మక కారణం అని చెప్తున్నారు. సాతాను యోబును పుండ్లుతో బాధించినప్పుడు, యోబు తన భార్యతో, “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా” అని అడిగాడు. (యోబు 2:10), మరియు రచయిత, సాతాను ద్వారా వచ్చిన ఈ పుండ్లను “యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధ” అని పిలుస్తాడు (యోబు 42:11). కాబట్టి, సాతాను నిజమైనవాడు. సాతాను దుఃఖాన్ని తెస్తాడు. కానీ అది చివరిది లేదా నిర్ణయాత్మకమైనది కాదు. అతను ఒక త్రాడుతో కట్టబడిన వాడు. దేవుడు నిర్ణయాత్మకంగా అనుమతించిన దానికంటే ఎక్కువ దూరం వెళ్లడు.
పాఠము #2. 2004 క్రిస్మస్ మరుసటి రోజు హిందూ మహాసముద్రంలో సాతాను ఆ సునామీని కలిగించినప్పటికీ, 200,000 మందికి పైగా మరణాలకు అతను నిర్ణయాత్మక కారణం కాదు; దేవుడే.
దేవుడు, యోబు 38:8 మరియు 11లో సునామీలపై అధికారం గలవాడిగా చెప్పుకొన్నాడు. ఆయన యోబును అలంకారికంగా అడిగినప్పుడు, “సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? . . . మరియు, ‘నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు’ అని అన్నాడు. కీర్తన 89:8-9 ఇలా చెబుతోంది, “యెహోవా. . . సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.” ఒకప్పుడు అలల ప్రాణాంతకమైన బెదిరింపులపై కలిగిన నియంత్రణను యేసు ఇప్పుడు కలిగి ఉన్నాడు: “ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను.” (లూకా 8:24). మరో మాటలో చెప్పాలంటే, సాతాను భూకంపం కలిగించినప్పటికీ, దేవుడు వాటిని ఆపగలిగే వాడే కానీ ఆయన అలా చేయలేదు.
పాఠము #3. ఈ ప్రపంచంలోని విధ్వంసకరమైన విపత్తులు తీర్పును మరియు దయను మిళితం చేస్తాయి.
దేవుని ఉద్దేశాలు తేలికైనవి కావు. యోబు దైవభక్తిగల వ్యక్తి మరియు అతని కష్టాలు దేవుడు వేసిన శిక్ష కాదు (యోబు 1:1, 8). అవి శుద్ధి చేసేవే కానీ శిక్ష కొరకు కాదు (యోబు 42:6). యాకోబు 5:11 ఇలా చెబుతోంది, “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.”
కానీ చనిపోయిన యోబు పిల్లల ఆధ్యాత్మిక స్థితి మనకు తెలియదు. యోబు వారి గురించి ఖచ్చితంగా చింతించాడు (యోబు 1:5). దేవుడు వారిని తీర్పు తీర్చాలని వారి ప్రాణాలను తీసి ఉండవచ్చు. మనకు తెలియదు.
అది నిజమైతే, అదే విపత్తు చివరికి యోబు పట్ల దయ మరియు అతని పిల్లలపై తీర్పు అని నిరూపించబడింది. ఈ ద్వంద్వ ప్రయోజనం అన్ని విపత్తుల విషయంలో నిజం. అవి తీర్పును మరియు దయను మిళితం చేస్తాయి. అవి శిక్ష మరియు శుద్ధీకరణ రెండింటిని జరిగిస్తాయి. బాధ మరియు మరణం కూడా, ఒకే సమయంలో తీర్పు మరియు దయ రెండూ కావచ్చు.
దీనికి స్పష్టమైన ఉదాహరణ యేసు మరణం. ఇది తీర్పు మరియు దయ రెండూ. ఇది యేసుపై తీర్పు ఎందుకంటే ఆయన మన పాపాలను భరించాడు (ఆయన సొంతం కాదు), మరియు మన శిక్షను భరించి (గలతీయులు 3:13; 1 పేతురు 2:24) మనకు నీతియైన ఆయనను విశ్వసించే మన పట్ల దయగా ఉంది (2 కొరింథీయులు 5: 21)
ఆదాము మరియు హవ్వ పతనం కారణంగా ఈ భూమిపై వచ్చిన శాపం మరియు బాధలు మరొక ఉదాహరణ. క్రీస్తును ఎన్నడూ విశ్వసించని వారు దానిని తీర్పుగా అనుభవిస్తారు, కానీ విశ్వాసులు బాధలైనప్పటికీ దానిని దయతో అనుభవిస్తారు – మహిమ కోసం సిద్ధపడతారు. ” ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,” (రోమా 8:20). ఇది దేవునికి లోబడుతుంది. అందుకే సునామీలు వస్తున్నాయి. కానీ నాశనమునకు లోనయిన ఇది “నిరీక్షణలో” ఉంది.
పాఠం #4. క్రీస్తు తన ప్రజలకు ఇచ్చే హృదయం, వారి విశ్వాసం ఏమైనప్పటికీ, బాధపడేవారి పట్ల కనికరం చూపుతుంది.
“ఏడ్చువారితో ఏడువుడి” (రోమా 12:16) అని బైబిలు చెప్పినప్పుడు, “దేవుడు ఏడపును ఇస్తే తప్ప” అని జోడించలేదు. యోబును ఓదార్చేవారు ఎక్కువగా మాట్లాడటం కంటే యోబుతో ఏడ్చి ఉండుంటే ఎక్కువ మేలు చేసేవారుగా ఉండేవారు. యోబు బాధ చివరికి దేవుని నుండి వచ్చినదని మనం కనుగొన్నప్పుడు దానిని ఎవరు మార్చలేరు. బాధపడే వారితో ఏడ్వడం సరైనది. ఎవరి వల్ల వచ్చినా బాధ బాధే. మనమందరం పాపులం. కారణాలను బట్టి సానుభూతి చూపించడం కాదు గాని, భాదను బట్టి చూపించాలి. మరియు మనమందరం ఇందులో కలిసి ఉన్నాము.
పాఠం #5. చివరగా, కష్టాలు అనుభవించే వారికి అర్హత లేకపోయినా, వారి పట్ల దయ చూపమని క్రీస్తు మనలను పిలుస్తున్నాడు.
ఇదే దయ యొక్క అర్థం – అయోగ్యులకు చేసే సహాయం. “వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి” (లూకా 6:27). ఈ విధంగానే క్రీస్తు మనతో ప్రవర్తించాడు (రోమా 5:10), శత్రువులుగా ఉన్నప్పుడు మన కోసం చనిపోయాడు. ఆ శక్తితో, మరియు ఆ ఉదాహరణతో, మనము అదే చేయాలి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web