దేవునికి తిరిగి చెల్లించేది ఎలా?
“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను”. (కీర్తన 116:12-14)
“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును” అనే మాట నన్ను భయానికి గురిచేస్తుంది. తిరిగి చెల్లించడం అనే మాట అప్పులాంటిది అని సునాయాసంగా కృప వివరిస్తుంది. నిజానికి ఇది ఎంతో ధారాళమైనది, అయితే మీరు దానికి తిరిగి చెల్లించాలి. అపొ. కార్య 17:25లో, దేవుడు “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు” అని పౌలు అన్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, మీరు దేవునికి ఏమీ ఇవ్వలేరు, లేదా ఆయన మొదటిగా మీకు ఇవ్వనిదానిని, మీకు చేయనిదానిని ఆయన కోసం చేయలేరు.
ఈ విషయాన్ని మీరు 1 కొరింథీ 15:10 వచనంలో కూడా చూస్తారు, “అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.” అందుచేత, మనం పని చేయడమనేది దేవునికి తిరిగి చెల్లించినట్లు కాదు, ఎందుకంటే ఆ పని అంతా దేవుని నుండి వచ్చిన మరొక బహుమానమే. దేవుని కోసం మనం చేసే ప్రతి క్రియతో కృపకు సంబంధించిన ఋణంలోనికి మరింత ఎక్కువగా కూరుకుపోతూ ఉంటాం.
కాబట్టి, కీర్తన 116లో ఎదో చేసిన అప్పును తీర్చుకొనే ఋణము చెల్లింపుగ దానిని పరిగణించకుండ చేసేది ఆ “చెల్లింపే” ఎందుకంటే వాస్తవానికి, అది సాధారణమైన చెల్లింపు కాదు గాని దేవుడు నిత్యమూ అనుగ్రహించు కృపను ఎత్తిచూపే స్వీకరించు మరొక చర్యగా ఉంది. ఇది మన సామర్థ్యాన్ని ఘనపరచదు.
“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అని కీర్తనాకారుడు వేసుకున్న ప్రశ్నకు జవాబుగా, “రక్షణపాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను” అని జవాబు చెబుతున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, రక్షణ పాత్రను నింపమని నేను ప్రభువును వేడుకుంటానని చెప్తున్నాడు. ప్రభువుకు తిరిగి చెల్లించడం అంటే ప్రభువు నుండి పొందడమని అర్థం, తద్వారా వర్ణించలేని ప్రభువు మంచితనం మహిమపరచబడుతుంది.
రక్షణపాత్రను చేతపుచ్చుకొని అనే ఈ మాట తృప్తినిచ్చు ప్రభువు అనుగ్రహించు రక్షణను ఒక చేత పట్టుకొని, దానిని త్రాగుతూ, మరింత ఎక్కువగా ఆయన నుండి ఎదురుచూడటాన్ని సూచిస్తోంది. ఈ విషయం మనకు తర్వాత వచ్చే, “యెహోవా నామమున ప్రార్థన చేసెదను” అనే మాటనుబట్టి తెలుసు. మరింత ఎక్కువ సహాయం కోసం నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనకు కృపా పూర్వకంగా జవాబునిచ్చినందుకు నేను ఆయనకు ఏమివ్వగలను? ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే నేను మరలా ప్రార్థించడమే. ఆయనకు నా అవసరత లేదు గాని నాకు ఆయన అవసరత ఏర్పడినప్పుడు ఆయన ఎన్నో ఉపకారాలను నాకు చేస్తాడని నేను దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ ఉంటాను (దీనిని నేను ఎల్లప్పుడూ చేస్తాను).
కీర్తనాకారుడు మూడవ మాటగా, “యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను” అని చెప్తాడు. అయితే ఆయన వాటిని ఎలా చెల్లిస్తాడు? అవన్నీ రక్షణ పాత్రను చేతపట్టుకొని, యెహోవా నామమున ప్రార్థన చేయుట ద్వారా చెల్లిస్తాడు. అంటే, మరింత ఎక్కువ కృప, చాలిన కృప ఎల్లప్పుడు ఉందనే వాగ్దానమందు నమ్మిక ఉంచుట ద్వారా అవన్నీ చెల్లించబడతాయి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web