కృప ఖచ్చితంగా ఉచితమై ఉండాలి

కృప ఖచ్చితంగా ఉచితమై ఉండాలి

షేర్ చెయ్యండి:

“ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” (1 కొరింథీ 4:7)

రక్షణను మీరు నివసించే ఇంటిలా ఊహించుకోండి.

అది మీకు సంరక్షణను ఇస్తుంది. అది మీకు శాశ్వతంగా ఉండే భోజన పానీయాలను నిల్వ ఉంచుతుంది. అది ఎప్పుడూ నాశనం కాదు లేదా అది పగిలిపోదు. దాని కిటికీలు సర్వ తృప్తిని కలిగించే మహిమ వైపుకు తెరుచుకొని ఉన్నాయి. 

దేవుడు దానిని ఎంతో ఖర్చుతో తన కోసం, తన కుమారుని కోసం నిర్మించుకున్నాడు మరియు ఆయన దానిని మీకు ఉచితంగా, ధారాళంగా ఇచ్చాడు. 

“కొనడం” అనే ఒప్పందాన్ని “క్రొత్త నిబంధన” అని పిలువబడింది. ఇక్కడున్న నియమాలు చదవండి: మీరు ఆ ఇంటిని బహుమానంగా స్వీకరించి, మీతోపాటు తండ్రి మరియు కుమారుడు ఇరువురు నివసిస్తున్నప్పుడు వారిలోనే మీ ఆనందాన్ని పొందుకుంటే ఇది మీ ఇల్లుగా మారుతుంది, మీకు సంబంధించిన ఇల్లుగానే ఉండిపోతుంది. ఇతర దేవతలకు మీ హృదయంలో ఆశ్రయమివ్వడం ద్వారా, ఇతర సుఖ భోగాల వెనుక వెళ్ళే విధంగా మీ హృదయాన్ని మరల్చడం ద్వారా దేవుని ఇంటిని అపవిత్రం చేయకూడదు, అయితే ఈ ఇంటిలో దేవునితో కలిగిన సంబంధంలోనే సంతృప్తిని కలిగి ఉండండి.” 

ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపి, ఇంటి కోసం ఎలాగైనా డబ్బులు కట్టాలని, ఖాతాలను బ్యాలెన్స్ చేసే నెలవారీగా డబ్బులు కట్టి చెల్లించాలనే ఆశతో డబ్బులు చెల్లించే వేళాపట్టిని రూపొందించడానికి ఒక న్యాయవాదిని నియమించడం మూర్ఖత్వం కాదా? 

మీరు పొందుకున్న ఇంటిని ఒక బహుమానంగా కాకుండా కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్నారు. దేవుడిక ఉచితంగా ఇచ్చే ఉపకారిగా ఉండడు. దేవుడు ఎప్పటికీ కోరుకొనని క్రొత్త డిమాండ్లకు మీరు బానిసలవుతారు. 

ఉచితంగా ఇవ్వబడినదానినే దానినే కృప అంటారు, అప్పుడు ఆ కృపను మనం తిరిగి చెల్లించే దానిగా పరిగణించం.  

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...