సాతాను దేవునికి ఎలా సేవ చేస్తాడు?
“సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు”. (యాకోబు 5:11)
రోగాలు మరియు వైకల్యాల వెనుక దేవుని అంతిమ చిత్తం దాగి ఉంటుంది. సాతాను ప్రమేయం లేదని కాదు గాని వాడు ఎల్లప్పుడూ ఏదో ఒక వినాశకర ఉద్దేశాలలో నిమగ్నమై ఉంటాడు (అపొ. కార్య 10:38). అయితే, వాని శక్తి నిర్ణయాత్మకం కాదు. దేవుని అనుమతి లేకుండా వాడు పనిచేయలేడు.
యోబు అనారోగ్యానికి ఇదొక కారణం. యోబుకు వ్యాధి వచ్చినప్పుడు, “కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను” (యోబు 2:7) అని వాక్యంలో స్పష్టంగా ఉంది. దేవుణ్ణి దూషించమని భార్య యోబును బలవంతపెట్టింది. అయితే, “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” (యోబు 2:10) అని జవాబిచ్చాడు. మరొకసారి, ప్రభావితమైన లేక స్పూర్తిని పొందుకున్న గ్రంథకర్త (1:22లో చెప్పినట్లే) యోబును మెచ్చుకుంటూ, “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు” అని అన్నాడు.
మరొక విధంగా చెప్పాలంటే, సాతాను విషయంలో దేవుని సార్వభౌమాధికారాన్ని చూసే సరియైన దృష్టికోణమిది. సాతాను నిజంగా ఉన్నాడు, మన ఉపద్రవాలలో సాతాను హస్తం ఉండవచ్చు గాని అది ఆఖరి హస్తం కాదు మరియు నిర్ణయాత్మకమైన హస్తం కూడా కాదు. యోబుకు కలిగిన శ్రమలన్నిటిలో దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని యాకోబు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు” (యాకోబు 5:11).
సాతాను ప్రమేయం ఉన్నప్పటికినీ, అంతిమ ఉద్దేశం దేవునిదే, అదేంటంటే “కనికరం మరియు కరుణ” చూపడం.
ఇదే పాఠాన్ని 2 కొరింథీ 12:7వ వచనం నుండి మనం నేర్చుకుంటాం, పౌలు తన శరీరములో ఉండేటువంటి ముల్లు “సాతాను దూత” అని, అత్యధికముగా హెచ్చిపోకుండ ఉండు నిమిత్తం తన పరిశుద్ధతను కాపాడుకునే ఉద్దేశం కోసం ఇవ్వబడిందని చెప్పాడు. “నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను!”
ఇప్పుడు, ఈ శ్రమలో వినయం కలిగి ఉండడమనేది సాతాను ఉద్దేశం కాదు. అందుచేత, ఇక్కడ ఉద్దేశం అంతా దేవునిదే. అంటే, పౌలు జీవితంలో దేవుని ఉద్దేశాలను నెరవేర్చుటకు దేవుని ద్వారా సాతాను ఉపయోగించుకోబడ్డాడని అర్థం. వాస్తవానికి, ఎన్నిక చేయబడిన దేవుని పిల్లల కోసమైతే సాతాను మనల్ని నాశనం చేయలేడు మరియు మన కోసం సాతాను చేసే దాడులన్నిటిని వానికి విరుద్ధంగానే మరలిస్తాడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web