కృతజ్ఞత యొక్క ఆకర్షణ శక్తి

షేర్ చెయ్యండి:

“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు”… (2 తిమోతి 3:1-2)

కృతజ్ఞత లేకపోవడం అనేది అహంకారం, దూషణ, అవిధేయతలతో కలిసి ఎలా వెళ్తోందో గమనించండి.  

వేరొక చోట, “కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు” (ఎఫెసీ 5:4) అని పౌలు చెప్తున్నాడు. అందుచేత, కృతజ్ఞత, ఉపకార స్మ్రుతి అనేవి వికృతత్వానికి మరియు హింసకు విరుద్ధమైనవి. 

ఇలా ఉండటానికి కారణం ఏంటంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడమనేది తగ్గింపుతో కూడిన భావనే గాని గర్వించేది కాదు. ఇది ఇతరుల్ని మెచ్చుకునేదే గాని స్వయాన్ని ఘనపరచుకునేది కాదు. ఇది సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఉంటుందే గాని కోపంతోను చేదు భావంతో కూడిన హృదయాన్ని కలిగియుండదు. చేదు భావంతో కూడిన ఉపకార స్మ్రుతి అనేది మాటలలో విభేదిస్తుంది. 

కృతజ్ఞతా హృదయాన్ని తెరవడానికి మరియు చేదు భావాలను, వికృతతను, అగౌరవాన్ని, హింసను అధిగమించడానికి కీలకమైన విషయం ఏంటంటే సృష్టికర్త, సంరక్షకుడు, అక్కరలన్నిటిని తీర్చువాడునూ మరియు నిరీక్షణను ప్రసాదించువాడునూనైనా దేవునిలో బలమైన నమ్మకాన్ని కలిగియుండడమే. ఒకవేళ మనకుండే ప్రతి దాని కోసం, నిరీక్షణ కలిగి ఉండబోయే ప్రతిదాని కోసం మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నామని నమ్మకపోతే మనలోని కృతజ్ఞతకున్న ఆధారం ఎండిపోయినట్లే. 

కాబట్టి, అంత్య కాలాలలో హింస, త్యాగం, వికృతత్వం, విధేయత పెరగడం అనేది దేవునికి సంబంధించిన సమస్య అని నేను నిర్ధారణకు వచ్చాను. ప్రాథమిక సమస్య ఏంటంటే మనం ఆధారపడే ఉన్నత స్థాయిలలో కృతజ్ఞతను కలిగి ఉండడంలో వైఫల్యం చెందడమే. 

దేవునిపట్ల ఉన్నతమైన కృతజ్ఞతా భావాన్ని గొప్పగా చూపించడం విఫలమైనప్పుడు, త్వరలోనే కృతజ్ఞతా కొలనులన్నీ పర్వతం క్రింద మరింత ఎండిపోవడం ప్రారంభిస్తాయి. కృతజ్ఞత అన్నది అంతరించిపోయినప్పుడు, స్వీయ సార్వభౌమత్వం అనేది దాని స్వంత సుఖాల కోసం క్రమేపి అంతరించిపోతుంది.

వినయపూర్వకంగా కృతజ్ఞతను తెలిపే గొప్ప మేల్కొలుపు కోసం ప్రార్థించండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...