మీరు దగ్గరికి వెళ్ళడమే దేవుని చిత్తం

మీరు దగ్గరికి వెళ్ళడమే దేవుని చిత్తం

షేర్ చెయ్యండి:

… యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము”. (హెబ్రీ 10:22)

ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధానమునకు చేరాలన్నదే మనకివ్వబడిన ఆజ్ఞ. మనం దేవుని సన్నిధానానికి చేరాలని, ఆయనతో మనం సహవాసం చేయాలని, దేవునికి దూరంగా మన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండకూడదని చెప్పడమే హెబ్రీ పుస్తకాన్ని వ్రాసిన గ్రంథకర్త యొక్క గొప్ప లక్ష్యం.

దేవుని సన్నిధానమునకు చేరడం అనేది భౌతికపరమైన చర్య కాదు. ఇది పరలోకానికి చేరుకోవడానికి మనం సాధించిన విజయాల ద్వారా బాబెలు గోపురాన్ని కట్టడం లాంటిది కాదు. ఇది ఖచ్చితంగా సంఘ భవనానికి వెళ్ళేది కాదు. లేదా, సంఘ భవనంలో ఉండే వేదిక వద్దకు వెళ్ళేది అంతకంటే కాదు. ఇది హృదయంలో జరిగే కనిపించని కార్యం. మీరు ఏమీ చేయకుండా ఊరకనే నిలబడినప్పుడు, లేక హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు, లేక మీరు పనిచేయడానికి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ పనిని జరిగించవచ్చు.

ఇదే సువార్తకు కేంద్రమై ఉన్నది, దీని గురించే గెత్సేమనే తోట మరియు శుభ శుక్రవారం సూచిస్తుంది, మనం దేవుని సన్నిధానానికి వెళ్ళే విధంగా చేయడానికి ఆయన ఎంతో ఆశ్చర్యకరమైన మరియు ఎంతో విలువైన కార్యాలను చేశాడు. దేవుని కుమారుడు ఈ లోకంలో శ్రమ పొంది, మరణించడం ద్వారా మనం తండ్రిని సమీపించడానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. విమోచనా కార్యం యొక్క గొప్ప ప్రణాళికలో ఆయన జరిగించిందంతా మనమందరం తండ్రిని సమీపించునట్లు చేయడమే. అలా దేవుణ్ణి సమీపించడం అనేది మన ఆనందం కోసం, ఆయన మహిమ కోసం జరుగుతుంది.

ఆయనకు మన అవసరత లేదు. మనం ఆయనకు దూరంగా ఉండడం ద్వారా ఆయనేమి పేదవాడైపోడు. త్రిత్వం యొక్క సహవాసంలో ఆనందంగా ఉండటానికి ఆయనకు మనం అవసరం లేదు. అయితే, మన పాపములు కనుపిస్తున్నప్పటికీ, మన ఆత్మలను పూర్తిగా, శాశ్వతంగా తృప్తిపరుస్తాడనే వాస్తవ స్థితికి తన కుమారుని ద్వారా ఉచిత ప్రవేశాన్ని మనకివ్వడం ద్వారా ఆయన తన కనికరాన్ని గొప్పగా చూపిస్తున్నాడు. “జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు” (కీర్తన 16:11)

మీరు దీన్ని చదివేటప్పుడు కూడా మీపట్ల దేవుని చిత్తం ఇదే. మీరు తండ్రిని సమీపించడం కోసమే క్రీస్తు మీ కోసం చనిపోయాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...