మీకు మేలు చేయడానికి దేవుడు ఆనందిస్తాడు
“నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను”. (యిర్మియా 32:40-41)
నేను నిరుత్సాహం చెందినప్పుడల్లా నేను పదేపదే చూసుకునే ఒకానొక దేవుని వాగ్దానమిది. దేవుడు మీకు మంచి చేయడానికి ఇష్టపడతాడనే మాటకంటే మరెక్కువ ప్రోత్సాహకరమైన మాట మరొకటి ఉంటుందా ఆలోచించండి? మీకు మంచి చేయాలని మాత్రమే కాదు. మీకు మంచి అనగా మహిమాన్వితమైన కార్యం చేయడానికి కట్టుబడియుండడం మాత్రమే కాదు, మీకు మంచి చేయడానికి ఆయన ఆనందిస్తాడు. “వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను”.
మన మంచి కోసం సమస్తం సమకూడి పని చేయడానికి రోమా 8:28వ వచనంలోని వాగ్దానాన్ని ఆయన అఇష్టంగా నెరవేర్చడు. ఇది మీకు మేలు చేయడానికి ఆయన కలిగియున్న ఆనందం. కేవలం కొన్ని సందర్భాలలోనే కాదు, ఆయన అన్ని వేళల మేలు చేయడానికి ఆనందాన్ని కలిగి ఉన్నాడు! “వారికి మేలు చేయకుండా నేను వెనుదిరుగను”. ఆయనను నమ్మే తన పిల్లలకు మేలు చేయడంలో ఆయన కలిగియున్న ఆనందంలోను లేక ఆయన కలిగియున్న నిబద్ధతలోను ఎలాంటి లోటుపాట్లు ఉండవు.
అది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది!
అయితే, కొన్నిమార్లు సంతోషంగా ఉండడం చాలా కష్టం. మనం ఎలాంటి ఆనందాన్ని పొందలేమనే విషయాన్ని భరించడానికి మన పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నాకు ఎదురైనప్పుడు, “నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన” (రోమా. 4:18) అబ్రహాము గారిని పోలి నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. వేరొక విధంగా చెప్పాలంటే, నిరీక్షణలేనటువంటి పరిస్థితిని చూసి, “దేవుని లాంటి బలం నీలో లేదు! ఆయనే అసాధ్యమైన కార్యాలను జరిగిస్తాడు అని తెలియజేస్తావు. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరి కోసం అసాధ్యమైన వాటిని చేయడానికి ఆయన ఇష్టపడతాడని నాకు తెలుసు. అందుచేత, నిస్సహాయత అనేది మీ చివరి మాట కాకూడదు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” అని చెప్పాలి.
నా కోసం విశ్వాసం విషయంలో మెరుపులాంటి అతి చిన్న విషయాన్ని కాపాడడానికి మరియు చివరిగా (వెనువెంటనే కాదు) దానిని పూర్తి నిశ్చయతతో కూడిన ఆనందపు జ్వాలగా మార్చడానికి దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడుగా ఉంటాడు. ఆ ఆనందంలోని గొప్ప భాగమే యిర్మియా 32:41.
ఆహా, సర్వశక్తిమంతుడైన దేవుని హృదయాన్ని ఆనంద పెట్టడంలో మీ కోసం మరియు నా కోసం మంచి చేయడమనేది కూడా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను! “వారికి మేలు చేయుటకు వారియందు ఆనందించుచున్నాను”.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web