దేవుడు దీనులను లక్ష్యపెడతాడు
“శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి – నశింపజేయుమనెను”. (ద్వితీ 33:27)
యేసు కోసం, ఆయన ప్రజల కోసం శ్రేష్టమైన సేవ చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే బాధాకరమైన పరిస్థితుల గుండా బహుశా ఇప్పుడు మీరు వెళ్తూ ఉన్నారేమో! ఒక వ్యక్తి తన జీవితంలో నిస్సహాయత లేక నిరాశలో కూరుకొనిపోయినప్పుడు, యుగయుగాలకు ఆశ్రయ దుర్గమైయున్న, ఎన్నటికీ మార్పులేని దేవున్ని ఆశ్రయించారని బహుశా ఆ వ్యక్తి తెలుసుకోవచ్చు.
ఉదయకాల కుటుంబ ధ్యాన సమయంలో మా కుటుంబంతా కీర్తన 138:6 “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును” అనే అద్భుతమైన వాక్యాన్ని చదివినట్లు నాకు గుర్తుంది.
దేవుడు లక్ష్యపెట్టలేని, పట్టించుకోలేనంత లోతుల్లోకి మీ జీవిత పరిస్థితులు మిమ్మల్ని ముంచివేయలేవు. వాస్తవానికి, మోషే భక్తుడు ద్వితీ 33:27 లో చెప్పినట్లుగా “శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును”. అలాగే దేవుడు మీ క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని పట్టుకోవడానికి అక్కడే వేచి చూస్తూంటాడు.
అవును, మీ సమస్యల్లో మీరు భయపడుతూ వణుకుతున్నది మరియు పడిపోతున్నది ఆయన చూస్తున్నాడు. మీరు అట్టడుగుకు జారిపోక ముందే ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు (ఎన్నోమార్లు పట్టుకున్నాడు కూడా). కానీ, ఇప్పుడైతే ఆయన మీకు క్రొత్త పాఠాలను నేర్పించాలానుకుంటున్నాడు.
కీర్తన 119:71లో “నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను” అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఇది చాలా సులభంగానూ లేక వినోదాత్మకంగానూ లేక ఆహ్లాదకరంగానూ ఉందని కీర్తనాకారుడు చెప్పట్లేదు. తనను తాను పునర్విమర్శ చేసుకుంటూ, “నాకు మేలాయెను” అని చెప్తున్నాడు.
గత వారం నేను స్కాటిష్ సేవకుడైన జేమ్స్ స్టీవర్ట్ గారి పుస్తకాన్ని చదువుతున్నాను. “ప్రేమతో కూడిన సేవలో, కేవలం గాయపడిన సైనికులు మాత్రమే సేవ చేయగలరు” అని ఆయన చెప్పాడు. అందుచేతనే, మీలో కొంతమంది ప్రేమతో కూడిన శ్రేష్టమైన సేవ కోసం ప్రస్తుతం సిద్ధం చేయబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే, మీరు గాయపడుతూ ఉన్నారు కాబట్టి.
మీకు కలిగిన గాయం మీ జీవితం పట్ల దేవుని కృపగల ప్రణాళికకు వేరుగా కలిగిందని మీరు ఆలోచించవద్దు. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి: “ఇదిగో నేను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు … నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే” (ద్వితీ 32:39)
భారాన్ని మోస్తూ మూలుగుతూ ఉన్నవారందరికి దేవుడు తన ప్రత్యేకమైన కృపను ప్రసాదించును గాక. ఇప్పుడు కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తున్న క్రొత్తదైన సున్నితమైన ప్రేమ కోసం ఆసక్తిగా చూడండి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web