మీరు కోల్పోలేని వాటిని పొందుకోండి

మీరు కోల్పోలేని వాటిని పొందుకోండి

షేర్ చెయ్యండి:

యేసు వారిని చూచి – ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు;
దేవునికి సమస్తమును సాధ్యమే అనెను”. (మార్కు. 10:27)

మీరు ప్రపంచ క్రైస్తవులుగా మారడానికి మరియు సరిహద్దులలో మిషన్స్ కోసం పని చేయడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి యేసు నుండి రెండు గొప్ప ప్రోత్సాహకరమైన మాటలు ఇక్కడున్నాయి. మీరు వెళ్ళేవారుగానైనా ఉంటారు లేక ఇతరులను పంపించువారుగానైనా ఉంటారు.

1. మనుష్యులకు అసాధ్యమైన ప్రతీది దేవునికి సాధ్యమవుతుంది (మార్కు 10:27). కఠినమైన పాపులను మార్చడం దేవుని పని మరియు అతని సార్వభౌమాధికార ప్రణాళికకు సంబంధించి ఉంటుంది. మన బలహీనతను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధం యెహోవాదే, ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు.

2. మన మిషనరీ జీవితం ముగిసినప్పుడు, క్రీస్తు మన కోసం పని చేస్తానని, మరియు అక్కడ ఉంటానని వాగ్దానం చేసినందున మనం ఎటువంటి త్యాగాలు చేశామని చెప్పుకోలేము (మార్కు 10:29-30).

మనం ఆయన మిషనరీ సూత్రాలను పాటించినప్పుడు, బాధాకరమైన దుష్ప్రభావాలు కూడా మన పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తాయని మనం తెలుసుకుంటాం. మన ఆధ్యాత్మిక ఆరోగ్యం, మన ఆనందం నూరంతలుగా అభివృద్ధి చెందుతుంది. మనం చనిపోయినప్పుడు, మనం చనిపోము గాని మనం నిత్యజీవాన్ని పొందుకుంటాం.

మీ ధైర్యాన్ని కోల్పోవాలని మరియు క్రీస్తు కోసం త్యాగాలు చేయడం మానేయమని నేను మిమ్మల్ని అడగడం లేదు. మీరు కలిగియున్నవాటిని త్యజించమని, మీకున్న లోతైన ఆకాంక్షలను తీర్చేటువంటి జీవితాన్ని పొందుకోమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజుల రాజుకు సేవ చేయడం యొక్క అమూల్యమైన విలువతో పోల్చితే ప్రతి దానిని పెంటగా ఎంచుకొమ్మని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంగడిలో కొన్నటువంటి దుస్తులను తీసివేసి, దేవుని రాయబారులుగా కనుపించే దుస్తులను ధరించుకొమ్మని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

మీకు కష్టాలు, హింసలు ఉంటాయి గాని మీరు గొప్ప ఆనందంతో ఉంటారని నేను వాగ్దానం చేస్తున్నాను! “నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది”  (మత్తయి 5:10)

జనవరి 8, 1956 లో ఈక్వెడార్ అనే దేశంలో కేవలం అరవై మంది ఉన్నటువంటి వవోరాని తెగకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ తెగకు చెందిన ఐదు మంది వ్యక్తులు జిమ్ ఎలియట్ గారిని మరియు ఆయనతో ఉన్నటువంటి నలుగురు మిషనరీలను చంపేశారు.  నలుగురి భార్యలు తమ భర్తలను పోగొట్టుకున్నారు, తొమ్మిది మంది పిల్లలు తమ తండ్రులను పోగొట్టుకున్నారు. దీనిని ప్రపంచమంతా విషాద పీడకలగా పిలిచిందని ఎలిజబెత్ ఎలియట్ గారు చెప్పారు. ఆ తరువాత ఆమె తను చెప్పిన మాటలకు జోడిస్తూ, “తను పోగొట్టుకోలేని వాటిని పొందుకోవడానికి తాను ఉంచుకోలేని వాటిని ఇచ్చే వాడు మూర్ఖుడు కాదు’ అని జిమ్ ఎలియట్ గారు నమ్మిన సిద్ధాంతములోని రెండవ మాటకు సంబంధించిన సత్యాన్ని ప్రపంచం గుర్తించలేదని” చెప్పింది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...