నిర్భయంగా ఉండటానికి ఐదు కారణాలు

నిర్భయంగా ఉండటానికి ఐదు కారణాలు

షేర్ చెయ్యండి:

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది”. (లూకా 12:32)

మనం డబ్బు విషయంలో గాని లేదా ఈ లోకములోని ఇతర విషయాలను బట్టి గాని భయపడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నిర్భయంగా ఉండడం ద్వారా – అంటే ఆందోళనల నుండి విడుదల పొందడం ద్వారా – ఆయన గురించిన ఐదు గొప్ప విషయాలు హెచ్చించబడతాయి.

మొదటిగా, భయపడకపోవడమనేది దేవుడు మన కాపరి అని సూచిస్తుంది. “చిన్న మందా భయపడకుడి.” మనము ఆయన మంద, ఆయన మన  కాపరి. ఆయన మన కాపరి అయితే, కీర్తన 23:1 వర్తిస్తుంది: “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” – అంటే, నా నిజమైన అవసరాలలో దేనికీ లోటు ఉండదు.

రెండవది, భయపడకపోవడమనేది దేవుడు మన తండ్రి అని సూచిస్తుంది. “మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది”. మనము ఆయన చిన్న మంద మాత్రమే కాదు; మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. ఆయన మీ అవసరాల విషయంలో నిజంగా శ్రద్ధ తీసుకుంటాడు నిజంగా తెలుసుకుంటాడు మరియు మీకు కావలసినది మీరు పొందుకునేలా మీ కోసం పని చేస్తాడు.

మూడవది, చింతించకపోవడమనేది దేవుడు మన రాజు అని సూచిస్తుంది. “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” ఆయన రాజు కాబట్టి ఆయన మనకు “రాజ్యాన్ని” ఇవ్వగలడు. దేవుడు రాజు అనే సత్యం మనకి రాజ్యాన్ని అనుగ్రహించే వాని శక్తిని సూచిస్తుంది. “కాపరి” అంటే భద్రత మరియు సదుపాయం. “తండ్రి” అంటే ప్రేమ, సున్నితత్వం, అధికారం, సదుపాయం మరియు మార్గదర్శకత్వం. “రాజు” అంటే అధికారం, సార్వభౌమాధికారం మరియు సంపద.

నాల్గవది, భయపడకపోవడమనేది దేవుడు ఎంత స్వేచ్ఛ మరియు దాతృత్వము గలవాడో సూచిస్తుంది. గమనించండి, ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” ఆయన రాజ్యాన్ని అమ్మడు లేదా రాజ్యాన్ని అద్దెకు ఇవ్వడు లేదా రాజ్యాన్ని లీజుకు ఇవ్వడు. ఆయన అనంతమైన సంపన్నుడు మరియు మన డబ్బులు అవసరం లేదు. కాబట్టి, దేవుడు తన అనుగ్రహం విషయములో దాతృత్వముతో స్వేచ్ఛగా ఉన్నాడు. మరియు మనం భయపడకుండా మన అవసరాలలో ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన హెచ్చించబడతాడు. 

చివరగా, భయపడకపోవడమనేది – చింతించకపోవడమనేది – దేవుడు నిజంగా దీన్ని చేయాలనుకుంటున్నాడని మనం విశ్వసిస్తున్నామని సూచిస్తుంది. “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” అది ఆయనకు ఆనందాన్నిస్తుంది. ఆయన బెంగపెట్టుకోవడం లేదు. మనకు రాజ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకు సంతోషం కలుగుతుంది. మన నుండి ఆశించకుండా ఇచ్చి సంతోషపెట్టే ఇలాంటి తండ్రులు మనందరికీ లేరు. కానీ ఇప్పుడు దుఃఖ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అలాంటి తండ్రి, గొర్రెల కాపరి మరియు రాజు ఉన్నాడు.

కాబట్టి, ఈ వచనం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి అనగా మనకు శాశ్వత జీవితాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వడానికి, మనము అక్కడికి చేరుకోవడానికి అవసరమైన ప్రతిదాన్ని ఇవ్వడానికి సంతోషంగా ఉన్న ఉదారమైన దేవుణ్ణి మన గొర్రెల కాపరిగా, తండ్రిగా మరియు రాజుగా మనం దాచుకోవాలి.

ఈ విధంగా దేవునిని మన హృదయంలో దాచుకుంటే, మనము నిర్భయంగా ఉంటాము మరియు దేవుడు ఆరాధించబడతాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...