అపనమ్మకంతో పోరాటం చేయండి
“ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి”. (ఎఫెసీ 6:16-17)
నేను వృద్ధాప్యం గురించి చింతిస్తున్నప్పుడు, “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” (యెషయా 46:4) అనే ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.
నేను చనిపోవడం గురించి చింతిస్తున్నప్పుడు, “మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను” (రోమా 14:7-9) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.
నా విశ్వాసపు ఓడ పగిలిపోయి, దేవునికి దూరమయ్యే పరిస్థితి గురించి నేను చింతిస్తున్నప్పుడు, “మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ 1:6); మరియు “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” (హెబ్రీ 7:25) అనే వాగ్దానాలను ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.
ఈ పోరాటంలో నాతోపాటు మీరూ చేరండి! మనం ఇతరులతో కాకుండా మనకున్న అపనమ్మకానికి విరుద్ధంగా పోరాటం చేద్దాం. దేవుని వాగ్దానాలను నమ్మకపోవడమే అపనమ్మకానికి మూలం, ఇదే అనేక ఇతర పాపాలకు మూలం కూడా. ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమని పౌలు ఎఫెసీ 6:17లో చెప్పాడు. సాతాను అగ్ని బాణాలను చల్లార్చడానికి మనకుండే డాలు విశ్వాసమే (వచనం 16), ఆ విశ్వాసం దేవుని వాక్యములోనే ఉండాలి. అందుచేత, మీ ఎడమచేతిలో డాలును పట్టుకొని, కుడిచేతిలో ఖడ్గాన్ని తీసుకొని, విశ్వాసం అనే మంచి పోరాటం చేద్దాం.
బైబిలును తీసుకోండి, సహాయం కోసం పరిశుద్ధాత్మను అడగండి, మీ హృదయాన్ని వాగ్దానాలతో నింపండి మరియు భవిష్యత్తు కృపలో విశ్వాసముంచి జీవించుటకు మంచి పోరాటం చేయండి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web