కంచరగాడిద వలె ఉండకండి
“బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను”. (కీర్తన 32:9)
దేవుని ప్రజలను అన్ని రకాల జంతువులు నివసించే పొలంగా ఊహించుకోండి. దేవుడు తన జంతువులను భద్రంగా చూసుకుంటాడు. అవి ఎక్కడికి వెళ్లాలో వాటికి చూపిస్తాడు మరియు వాటి రక్షణ కోసం ఒక ధాన్యాగారం సరఫరా చేస్తాడు.
కానీ ఈ జంతు క్షేత్రంలో ఒక మృగం ఉంది. అది దేవునికి నీచంగా కనబడుతుంది. అదే కంచరగాడిద. అది తెలివి తక్కువది, మొండిది. అయితే వీటిలో ఏది మొదట వస్తుందో మీరు చెప్పలేరు.
ఇప్పుడు దేవుడు తన జంతువులను వాటి ఆహారం మరియు ఆశ్రయం కోసం ధాన్యాగారానికి తీసుకురావడానికి ఎంచుకున్న మార్గం ఏమిటంటే, వాటికి వ్యక్తిగతంగా పేరు ఉందని వాటికి బోధించి, ఆపై వాటిని పేరు పెట్టి పిలవడం. “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8).
కానీ కంచరగాడిద అలాంటి పిలుపుకు స్పందించదు. అది అవగాహన లేనిది. కాబట్టి దేవుడు తన జంతువులను తీసుకువెళ్ళే వాహనంతో పొలంలోకి వెళ్లి, కంచరగాడిద నోటికి కళ్ళెం వేసి, దానిని వాహనంకు తగిలించి, దానిని గట్టిగా కాళ్ళతో ఈడ్చుకెళ్లి దొడ్డిదారిన ధాన్యాగారానికి తీసుకువెళ్లాడు.
ఆశీర్వాదం మరియు రక్షణ కోసం జంతువులు తన వద్దకు రావాలని దేవుడు కోరుకునే మార్గం అది కాదు.
ఒకరోజు ఆ కంచరగాడిదకి చాలా ఆలస్యం అవుతుంది. ఆయన వడగళ్ళు వాన, ఉరుములు మెరుపులును పంపించినపుడు అది పరుగున వచ్చినప్పుడు, ధాన్యాగారం తలుపు మూసివేయబడుతుంది.
కాబట్టి, కంచరగాడిద లాగా ఉండకండి. “బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి”
దానికి బదులుగా, కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు.(కీర్తన 32:6)
కంచరగాడిదలా ఉండకూడని మార్గం ఏమిటంటే, మనల్ని మనం తగ్గించుకోవడం, ప్రార్థనలో దేవుని వద్దకు రావడం, మన పాపాలను ఒప్పుకోవడం మరియు అవసరమైన చిన్న కోడిపిల్లలు లాగా, ఆయన రక్షణ మరియు సదుపాయం యొక్క ధాన్యాగారంలోకి దేవుని నడిపింపును అంగీకరించడం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web