మీ హృదయాన్ని కఠినపరచుకోకండి
“తన [ఆయన] విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము”. (హెబ్రీ 3:18-19)
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం రెండు భాగాలుగా విభజించబడడం చూసి, ఆరిన నేల మీద సముద్రం గుండా నడిచినప్పటికీ, వారికి దాహం వేసిన మరుక్షణమే, వారి హృదయాలు దేవునిపట్ల కఠినంగా మారిపోయాయి మరియు దేవుడు తమ్మును జాగ్రత్తగా చూసుకుంటాడని వారు ఆయనను విశ్వసించలేకపోయిరి. ఐగుప్తులోనే జీవితం చాలా బాగుండేదని వారు దేవునికి విరుద్ధంగా సణుగుకున్నారు.
ఇలాంటి విషయాన్ని నిరోధించడానికే హెబ్రీయుల పుస్తకం వ్రాయబడింది. క్రైస్తవులుగా పిలవబడుతున్న ఎంతోమంది తమ ప్రయాణాన్ని దేవునితో ప్రారంభిస్తారు. తమ పాపాలు క్షమించబడతాయని, నరకం నుండి తప్పించుకుని పరలోకానికి వెళ్తారని వారు వింటారు. అంతేగాకుండా, “నేను కోల్పోవటానికి ఏమి ఉంది? నేను నమ్ముతాను” అని వారంటారు.
అయితే, ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో లేదా పది సంవత్సరాలలోనో అరణ్యంలో నీళ్ళు లేనటువంటి కాలం వస్తుంది. మన్నాతో విసుగు వస్తుంది. సంఖ్యా 11:5-6లో, “ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి” అని చెప్పినట్లుగా ఐగుప్తులో క్షణిక ఆనందాలపట్ల కోరిక పెరుగుతుంది.
క్రీస్తు, దేవుని వాక్యం, ప్రార్థన, ఆరాధన, మిషన్స్ (ప్రేషితోద్యమాలు) మరియు దేవుని మహిమ కోసం బ్రతకడం అనేవాటిలో ఆసక్తి కోల్పోయారని మరియు ఈ లోకానికి సంబంధించిన అల్ప సుఖాలన్నీ ఆత్మ సంగతులకంటే ఆకర్షితమైనవని మీరు తెలుసుకోవడమనేది భయంకరమైన విషయం.
మీ పరిస్థితి అలాంటిదైతే, “అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరి” అనే ఈ వాక్యంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు మీరు వినాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను! దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. పాపపు మోసకారితనం విషయమై జాగ్రత్తపడండి. మన విశ్వాసానికి ప్రధాన యాజకుడైన, అపొస్తలుడైన క్రీస్తును కలిగియుండండి, ఆయనయందు మీకున్న నిరీక్షణ మరియు నిశ్చయతలను గట్టిగా పట్టుకోండి.
ఒకవేళ మీరు దేవునితో ప్రారంభించకపోయినట్లయితే, మీ నిరీక్షణను ఆయనలో ఉంచండి. పాపం మరియు స్వబుద్ధిపై ఆధారపడకుండా, మీ విశ్వాసాన్ని గొప్ప రక్షకునిలో ఉంచండి. మీరు నమ్మి, సహించి, జీవించడానికే ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web