మార్పు సాధ్యమే
“నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను”. (ఎఫెసీ 4:24)
క్రైస్తవ్యం అంటేనే మార్పు సాధ్యమని అర్థం. లోతైన, మౌలికమైన మార్పు సాధ్యం. మీరు మొద్దుబారిపోయి, బండబారిపోయిప్పుడు మీ హృదయం సున్నితంగా మారడానికి సాధ్యమవుతుంది. కక్ష, కోపం అనేవాటి ద్వారా దాడి చేయబడకుండ ఆపడం కూడా సాధ్యమే. మీ నేపథ్యం ఏదైనప్పటికీ, ప్రేమగల వ్యక్తిగా మారడమనేది కూడా సాధ్యమే.
మన౦ ఎలా ఉ౦డాలి అనే దానిలో దేవుడే నిర్ణయాన్ని తీసుకుంటాడని బైబిలు భావిస్తో౦ది. నిర్మొహమాట౦ లేకుండా ఎంతో అద్భుతంగా, “సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కరుణాహృదయులై..” (ఎఫెసీ 4:31-32) ఉండాలని బైబిల్ చెబుతోంది. “వీలైతే. . . ” లేదా, “మీ తల్లిదండ్రులు కరుణాహృదయులైతే… ” లేదా, “మీరు తీవ్రంగా దూషించబడకపోతే … ” అని బైబిల్ చెప్పట్లేదు గాని “మీరు కరుణాహృదయులై ఉండండి” అని బైబిల్ బోధిస్తోంది.
ఇది ఎంతో అద్భుతమైన స్వేచ్చ. నాకు మార్పు అసాధ్యమని చెప్పే భయంకరమైన కర్మవాదం నుండి లేక అదృష్టమే కారణమనే నమ్మకం నుండి, లేక మూఢ నమ్మకం నుండి (ఫేటలిజం నుండి) మనల్ని విడిపిస్తుంది. ఇది నా నేపథ్యాన్ని నా గమ్యంగా మార్చే యాంత్రిక అభిప్రాయాల నుండి నన్ను విడిపిస్తుంది.
దేవుని ఆజ్ఞలు ఎల్లప్పుడూ స్వేచ్చతో ఉంటాయి మరియు జీవితాన్ని మార్చే సత్యమును నమ్మునట్లు చేస్తాయి. ఉదాహరణకు, ఈ క్రింది మాటలను పరిశీలన చేయండి.
- దేవుడు మనల్ని తన పిల్లలుగా దత్తతు తీసుకున్నాడు. మనకిప్పుడు ఒక క్రొత్త తండ్రి మరియు ఒక క్రొత్త కుటుంబం ఉంది. మన “పూర్వీకుల” నుండి వచ్చిన మూఢ నమ్మకాలకున్న శక్తిని పైన చెప్పబడిన సత్యం బద్దలు కొడుతుంది. “భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు” (మత్తయి 23:9).
- దేవుడు తన పిల్లలుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం “ప్రేమించబడిన పిల్లలం” (ఎఫెసీ 5:1). దేవుని ప్రేమను కనుపరచాలానే ఆజ్ఞ గాలిలో అలా వ్రేలాడుతూ ఉండిపోదు గాని అది శక్తితో కూడినదై ఉన్నది: “ప్రేమించబడిన పిల్లలుగా దేవుని పోలి నడుచుకోవాలి”. “ప్రేమించండి!” అనేది ఒక ఆజ్ఞ మరియు దేవునిచేత ప్రేమించబడడమనేది శక్తియై ఉన్నది.
- దేవుడు మనల్ని క్రీస్తునందు క్షమించాడు. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగానే మీరు కూడా కరుణాహృదయులై క్షమించండి (ఎఫెసీ 4:32). క్రీస్తునందు దేవుడు జరిగించిన కార్యం అనేది ఎంతో శక్తివంతమైనది. మార్పు సాధ్యమేనని ఇది చెప్తోంది. కరుణాహృదయులై ఉండండి అనే ఆజ్ఞ తల్లిదండ్రులు మీకు చేసినదానికంటే ఎక్కువగా దేవుడు మీకు ఏమి చేశాడనే దానితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నది. ఈ రకమైన ఆజ్ఞ అంటేనే మీరు మార్పు చెందగలరని అర్థం.
- క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, మీ కోసం తన సర్వస్వాన్నే అర్పించాడు. “క్రీస్తు [మిమ్మల్ని] ప్రేమించినట్లుగానే మీరు కూడా ప్రేమను కలిగి నడుచుకోండి (ఎఫెసీ 5:2). ఆజ్ఞ అనేది జీవితాన్ని మార్చేటువంటి సత్యంతో వస్తుంది. “క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు.” ప్రేమించడానికి అవకాశమున్న ప్రతి క్షణాన, “మీరు ప్రేమించే వ్యక్తీ కాదు” అని ఏదో ఒక స్వరం చెప్తుంది, అప్పుడు మీరు, “నా కోసం క్రీస్తు చూపిన ప్రేమ నన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చేసింది. ప్రేమకు సంబంధించిన వాగ్దానం నాలో సాధ్యమైన రీతిగానే ప్రేమించమని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా సాధ్యమే.”
కర్మవాదిగా లేక అదృష్టమే కారణమనే వ్యక్తిగా లేక మూఢ నమ్మకాలు కలిగిన వ్యక్తిగా ఉండవద్దు. మార్పు సాధ్యమే. దేవుడు సజీవుడు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. వాగ్దానాలన్నీ సత్యమే.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web