“నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను”. (యోహాను 17:26)
మరణించడానికి ముందు రాత్రి యేసు ఇలానే ప్రార్థించాడు. ఎంతో ఆనందకరమైనదాన్ని ఎప్పటికీ అశేష శక్తితో మరియు ఆసక్తితో ఆస్వాదించగలగడాన్ని ఊహించండి. ఇది ఇప్పుడు మన అనుభవం కాదు. ఈ లోకంలో మన సంపూర్ణ సంతృప్తికి మూడు విషయాలు అడ్డుగా నిలుస్తాయి.
ఒకటి, ఈ సృష్టిలో ఏదీ మన హృదయాలలోని లోతైన కోరికలను తీర్చగలిగేంత గొప్ప వ్యక్తిగత విలువను కలిగి లేదు.
మరొకటి ఏమిటంటే, అత్యుత్తమ సంపదలను వాటిని సంపూర్ణంగా ఆస్వాదించే శక్తి మనకు లేదు.
మరియు పరిపూర్ణ సంతృప్తికి మూడవ అడ్డంకి ఏమిటంటే, మన ఆనందాలు ముగిసిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు. కానీ యోహాను 17:26లోని యేసు లక్ష్యం మరియు ప్రార్థన నిజమైతే, ఇవన్నీ మారుతాయి. “తండ్రీ, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును” అని ఆయన ప్రార్థించాడు. తన కుమారుని పట్ల దేవునికి ఉన్న అనంతమైన సంతోషకరమైన ప్రేమ మనలో ఉండాలని ప్రార్థించాడు.
కుమారునిలో దేవుని సంతోషం కుమారునిలో మనకు ఆనందమైతే, మన ఆనందానికి కారణమైన యేసు, వ్యక్తిగత విలువలో తరగనివాడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ విసుగుగా లేదా నిరాశగా లేదా అసంతృప్తిగా అనిపించడు.
దేవుని కుమారుని కంటే గొప్ప నిధిని ఊహించలేము.
అంతేకాకుండా, ఈ తరగని నిధిని ఆస్వాదించగల మన సామర్థ్యం మానవ బలహీనతల వలన పరిమితం కాదు. మనము దేవుని కుమారున్ని తన తండ్రి యొక్క ఆనందముతో ఆనందిస్తాము. యేసు ప్రార్థించినది అదే!
తన కుమారునిపై దేవుని సంతోషం మనలో ఉంటుంది మరియు అది మనది అవుతుంది – కుమారునిలో మనము ఆనందిస్తాం. మరియు ఇది ఎప్పటికీ ముగియదు, ఎందుకంటే తండ్రి లేదా కుమారుడు ఎప్పటికీ ముగియరు.
ఒకరిపట్ల ఒకరికి వారి మద్య ఉన్న ప్రేమ, మనకున్న ప్రేమగా ఉంటుంది కాబట్టి వారిని ప్రేమించడం ఎప్పటికీ చావదు, అలాగే తగ్గదు.