బైబిల్ ప్రకారం ఎందుకని ప్రతి క్రైస్తవుడు సంఘసభ్యుడై ఉండాలి?

బైబిల్ ప్రకారం ఎందుకని ప్రతి క్రైస్తవుడు సంఘసభ్యుడై ఉండాలి?

షేర్ చెయ్యండి:

ప్రతి క్రైస్తవుడు ఒక సంఘంలో సభ్యుడై యుండాలి ఎందుకంటె, ఇది బైబిలు కోరుతున్న మరియు చెప్పుతున్న విషయం. నిజమే, ‘‘ప్రతి క్రైస్తవుడు ఒక స్థానిక సంఘంలో సభ్యుడై యుండాలి’’ అని బైబిలులో సూటియైన వాక్యం లేదు. గాని ప్రతి క్రైస్తవుడు ఒక స్థానిక సంఘంలో సభ్యుడై యుండాలని రెండు బైబిలు వాస్తవమైన అంశాలు సూచిస్తున్నాయి.

1) సంఘం, ప్రజలందరి (విశ్వాసులందరి) కొరకు, భూలోకంలో ఉండే సంస్థయై యుండునట్లు యేసు స్థాపించాడు. ఇది ఆయన యందు విశ్వాసముంచువారిని గుర్తిస్తుంది, ధృవీకరిస్తుంది, మరియు పర్యవేక్షిస్తుంది (మత్తయి 16:18-19, 18:15-20). క్రైస్తవులు యేసు గూర్చిన సువర్తమానమును లోకానికి తెలియజేయడానికి వారిని బహిరంగంగా ప్రజలందరి ముందుంచవలెనని ఆయన సంఘాన్ని స్థాపించాడు (యోహాను 17:21,23; చూడుము – ఎఫెసీ 3:10). ఆయనకు చెందినవారెవరో, చెందనివారెవరో లోకం తెలిసికోవాలని యేసు ఆశిస్తున్నాడు. లేదంటే, ఆయనకు చెందినవారెవరో, చెందనివారెవరో లోకానికి ఎలా తెలుస్తుంది? ఈ ఉద్దేశంతోనే ఆయన స్థాపించిన కంటికి కనబడుతున్న, బహిరంగ సంస్థయైన సంఘంలో దేవుని ప్రజలతో తమ్మునుతాము బహిరంగంగా గుర్తించుకొనువారిని లోకం చూడాలి. సంఘ సభ్యులను లోకం చూడాలి. ఇది ఇట్లుండగా, స్థానికంగా ఏ సంఘానికైననూ చెందకుండానే, వారు సార్వత్రిక సంఘంలో భాగమై యున్నారని స్వామ్యాధికారముతో చెప్పుకొను కొందరు, వారి కొరకు యేసు తయారు చేసిన ప్రణాళికను మరియు ఆయన సంఘాన్ని తృణీకరిస్తున్నారని అర్థం. ఆయనకు చెందినవారు బహిరంగంగా కంటికి కనబడువారుగా గుర్తింపబడాలనేది యేసు తాత్పర్యమై యున్నది – ఇదెలా జరుగుతుంది?, స్థానిక సంఘాలలో సభ్యులవుట ద్వారానే, కదా!

2) క్రైస్తవులు వారి నాయకులకు, లోబడుచుండాలని బైబిలు పదే పదే ఆజ్ఞాపిస్తున్నది (హెబ్రీ 13:17; 1 థెస్స 5:12-13). ఇదెలా జరుగుతుంది? దీనికి ఒకటే ఒక మార్గమున్నది. ఏమంటే విశ్వాసుల మందలో సభ్యులుగా ఉండటానికి బహిరంగంగా కట్టుబడి ఉండటం; కట్టుబడి ఉంటూ, ‘‘నేను మీ బోధలు వినడానికి, మీరిచ్చే మార్గనిర్దేశాలను అనుసరించడానికి, మరియు మీ నాయకత్వానికి లోబడి ఉండుటకు కట్టుబడి ఉంటానని’’ చెప్పుతున్నారు. ఒకడు ఎప్పటికినీ ఒక స్థానిక సంఘంలో చేరడం ద్వారా వారికి వాస్తవంగా లోబడనట్లయితే, ‘‘మీ నాయకులకు లోబడి యుండుడని’’ బైబిలు చెప్పుతున్న ఆజ్ఞలకు లోబడుటకు ఇతరమైన మార్గమేదీ లేదు.

9 మార్క్స్

9 మార్క్స్

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...