ఆధ్యాత్మిక పరిపక్వతకు కీలకమైన అంశం

ఆధ్యాత్మిక పరిపక్వతకు కీలకమైన అంశం

షేర్ చెయ్యండి:

“వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును”. (హెబ్రీ 5:14)

ఇప్పుడు ఇది అద్భుతమైన విషయం. దీన్ని వదులుకోకండి. ఇది బహుశా సంవత్సరాల తరబడి వృధా చేసుకున్న జీవితాన్ని రక్షించవచ్చు.

ఈ వచనం ఏమి చెబుతోందంటే, దేవుని మాటల యొక్క మరింత దృఢమైన బోధలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి మరియు మీరు పరిపక్వత చెందడానికి, దేవుని సువార్త వాగ్దానాల యొక్క శ్రేష్టమైన, పుష్టిగా ఉన్న పోషకాంశములు కలిగిన పాలు మీ నైతిక ఇంద్రియాలను, అంటే మీ ఆధ్యాత్మిక మనస్సును రూపాంతరం చేస్తుంది. తద్వారా మీరు మంచి మరియు చెడుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివేచించగలరు.

ఈ విషయాన్ని మరో విధంగా చెబుతాను వినండి. దేవుని వాక్యపు విందుకు సిద్ధపడడ౦ అనేది మొదటిగా మేధోపరమైన సవాలు కాదు; ఇది మొదటిగా నైతికపరమైన సవాలు. మీరు దేవుని వాక్యమనే బలమైన ఆహారాన్ని తినాలనుకుంటే, మంచి మరియు చెడుల మధ్య విచక్షణను గుర్తించే మనస్సును పెంపొందించుకోవడానికి మీరు మీ ఆధ్యాత్మిక ఇంద్రియాలను ఉపయోగించాలి. కాబట్టి ఇది మేధోపరమైన సవాలు మాత్రమే కాదు గాని నైతికపరమైన సవాలు కూడా.

ఆశ్చర్యానికి గురి చేసే సత్యం ఏంటంటే, ఆదికాండం మరియు హెబ్రీయుల గ్రంథాలలో మెల్కీసెదెకును గురించి అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే, బహూశా మీరు ప్రశ్నార్థకమైన టివి కార్యక్రమాలను చూడటంవలన కావచ్చు. మీరు ఎన్నిక చేయబడ్డారనే సిద్ధాంతం గురించి ఇబ్బందిపడుతున్నట్లయితే, బహుశా మీరు ఇంకా నీచమైన కొన్ని వ్యాపారాలు చేస్తున్నందువలన కావచ్చు. సిలువలో దేవుని కేంద్రిత క్రీస్తు కార్యమును గురించి ఇబ్బందిపడుతున్నట్లయితే, బహుశా మీరు ధనాన్ని ప్రేమించి, ఎక్కువ ఖర్చు పెడుతూ, తక్కువ ఇస్తున్నందున కావచ్చు.

బలమైన వాక్యానుసారమైన ఆహారానికి మరియు పరిపక్వతకు మార్గం ఏంటంటే మొదటిగా మేధోపరమైన వ్యక్తిగా మారడం కాదు గాని విధేయతను చూపు వ్యక్తిగా మారడం. మీరు పాఠశాలకు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు అనేదానికంటే బలమైన ఆహరం కోసం మీకున్న సామర్థ్యంతో మద్యం, సెక్స్, డబ్బు, విశ్రాంతి, ఆహారం, కంప్యూటర్లతోనూ మరియు ఇతరులతోనూ మీరు ఎలా వ్యవహరిస్తున్నారనేదే చాలా ప్రాముఖ్యం.

ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనమున్న అత్యంత సాంకేతిక సమాజంలో విద్య, ముఖ్యంగా మేధోపరమైన విద్య మాత్రమే పరిపక్వతకు కీలకాంశమని మనం భావించే అవకాశం ఉంది. దేవునికి సంబంధించిన సంగతులపై ఆధ్యాత్మిక అపరిపక్వతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పి.హెచ్.డి.లు చేసినవారు చాలామందే ఉన్నారు. తక్కువ విద్య మరియు లోతైన పరిపక్వతను కలిగి, దేవుని వాక్యములోని లోతైన సంగతులతో తమను తాము పోషించుకొనే పరిశుద్ధులు చాలా తక్కువమంది ఉన్నారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...