. . . “రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు”. (1 థెస్సలొనీకయులు 1:10)

మీరు చిన్నతనంలో తప్పిపోయిన సమయమును, లేదా కొండ చరియలు మిమ్మల్ని దాటి పడిపోవడాన్ని లేదా మునిగిపోయే సమయాలు మీకు గురతున్నాయా? అప్పుడు అకస్మాత్తుగా మీరు రక్షించబడ్డారు. మీ “ప్రియమైన జీవితం” కోసం పోరాడారు. మీరు దాదాపు కోల్పోతారేమో అని మీరు వణికిపోయారు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఆహా!, చాలా సంతోషం మరియు ధన్యవాదాలు. మరియు మీరు ఆనందంతో వణికిపోయారు.

సంవత్సరం చివర్లో, దేవుని ఉగ్రత నుండి రక్షించబడిన నేను కూడా అలానే భావిస్తున్నాను. క్రిస్మస్ రోజు మొత్తం మేము చలిమంట వేసి కూర్చొన్నాము. కొన్నిసార్లు బొగ్గు చాలా వేడిగా ఉన్నందున, నేను దానిని కాల్చినప్పుడు నా చేతికి గాయమైంది. నరకంలో, పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రతను గూర్చిన భయంకరమైన ఆలోచనలతో నేను వెనక్కి తిరిగి వణుకుతున్నాను. అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా!

క్రిస్మస్ మధ్యాహ్నం, శరీరంలో 87 శాతానికి పైగా కాలిపోయిన స్త్రీని నేను సందర్శించాను. ఆగస్టు నుంచి ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె కోసం నా గుండె పగిలిపోయింది. రాబోయే యుగంలో కొత్త శరీరం వస్తుందని దేవుని వాక్యం నుండి ఆమెకు నిరీక్షణను అందించడం ఎంత అద్భుతం! కానీ నేను ఈ జీవితంలో ఆమె పడుతున్న బాధ గురించి మాత్రమే కాకుండా, యేసు ద్వారా నేను రక్షింపబడిన శాశ్వతమైన బాధ గురించి కూడా ఆలోచిస్తూ బయటికి వచ్చాను.

నాతోపాటు నా అనుభవాన్ని పరీక్షించు. ఈ వణుకుతున్న ఆనందం సంవత్సరాన్ని ముగించడానికి తగిన మార్గమా? “యేసు . . . రాబోవు ఉగ్రత నుండి మనలను విడిపించును” (1 థెస్సలొనీకయులకు 1:10) అని పౌలు అంటున్నాడు. అతను హెచ్చరించాడు “సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.” (రోమా 2:8). మరియు “[లైంగిక అనైతికత, అపవిత్రత మరియు దురాశ] కారణంగా దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును” (ఎఫెసీయులకు 5:6).

 ఈ సంవత్సరం చివర్లో, నేను బైబిల్ లో నా ప్రయాణాన్ని ముగించుకుంటూ చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నాను. ఇది దేవుని విజయానికి సంబంధించిన మహిమాన్వితమైన ప్రవచనం, మరియు “జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిన” అందరికీ శాశ్వతమైన ఆనందం (ప్రకటన 22:17). వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు (ప్రకటన 21:4).

కానీ అయ్యో, పశ్చాత్తాపపడకపోవడం మరియు యేసు యొక్క సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకోకపోవడం ఎంత భయంకరం! “ప్రేమ అపొస్తలుడు” (యోహాను) ద్వారా దేవుని ఉగ్రత యొక్క వర్ణన భయానకమైనది. దేవుని ప్రేమను తృణీకరించేవారు “ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వారు బాధింపబడుదురు. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.”(ప్రకటన 14:10-11).

“ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ” (ప్రకటన 20:15). యేసు “సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.” (ప్రకటన 19:15). మరియు రక్తం “నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి ప్రవహించెను.” (ప్రకటన 14:20). ఆ దర్శనం దేనిని సూచించినప్పటికి, అది చెప్పలేని భయంకరమైన ఏదో చేయడానికి ఉద్దేశించబడిందని సూచిస్తుంది.నేను రక్షించబడ్డానని ఆనందంతో వణుకుతున్నాను! కానీ దేవుని పవిత్ర కోపం ఒక భయంకరమైన విధి. సోదర సోదరీ మనులారా, దీని నుండి పారిపోండి. నీ శక్తి అంతటితో దీని నుండి పారిపో. మరియు మనకు వీలైనంత ఎక్కువ మందిని రక్షిద్దాం! మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును (లూకా 15:7)!

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *