“కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.. . . . మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి”. (1 కొరింథీ. 10:31; కొలస్సీ. 3:17)
మీరు ఉదయాన్నే లేచి, ఎటువంటి ఆశలు కలిగి ఉంటారు? ప్రారంభం నుండి చివరి వరకు ఒక రోజుని గమనించినప్పుడు, మీరు జీవించినదానికి ఏమి జరగాలనుకుంటున్నారు?
“నేను ఎప్పుడు అలా ఆలోచించను. నేను లేచి చేయవలసింది చేస్తాను” అని మీరు చెబితే, అప్పుడు మీరు కృపకు మూలమైన మరియు మార్గానికి, బలమునకు, ఫలించడానికి మరియు ఆనందమునకు మూలమైన దానినుండి మిమ్మల్ని మీరు వేరుచేసుకుంటున్నారు. బైబిల్లో మరియు అలాగే ఈ వాక్యాలలో స్పష్టంగా దాని గురించి వ్రాయబడి ఉంది. మనం బ్రతికినన్ని రోజులు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు.
మీ కోసం దేవుడు వెల్లడించిన సంకల్పం ఏమిటంటే, ఉదయం లేచినప్పుడు, మీరు రోజంతా లక్ష్యరహితంగా తిరుగుతూ ఉండకుండా, కేవలం పరిస్థితులే మీరు చేసే పనిని నిర్దేశిస్తాయి అని అనుకోకుండా, ఏదో ఒక లక్ష్యంతో – మీరు ఒక నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి పెట్టాలి. నేను ఇక్కడ పిల్లలు, యుక్తవయస్కులు మరియు పెద్దలు అలాగే అవివాహితులు, వివాహితులు, వితంతువులు, తల్లులు మరియు ఎటువంటి వ్యాపారం చేసేవారైనా, ఎటువంటి వృత్తిలో ఉన్నవారైన సరే వారందరి గురించి మాట్లాడుతున్నాను.
లక్ష్యం లేకపోవడం నిర్జీవత్వానికి సమానం. కుక్క, పిల్లలు, మరి దేనికంటే కూడా ఎక్కువగా పెరట్లో చనిపోయిన ఆకులు ఎక్కువగా తిరుగుతాయి. గాలి ఈ వైపు వీస్తుంది అంటే అవి ఈ వైపు వెళతాయి. గాలి ఆ వైపు వీస్తుంటే, అవి ఆ వైపు వెళతాయి. అవి దొర్లుతాయి, ఎగురుతాయి, దాటి వెళ్తాయి, అవి కంచెకు వ్యతిరేకంగా నొక్కుకు పోతాయి, కానీ వాటికి ఎటువంటి లక్ష్యం లేదు. అవి అటుఇటు తిరుగుతూ జీవం లేనివిగా ఉంటాయి.జీవితపు పెరట్లో ఊడిపోయిన నిర్జీవమైన ఆకుల్లాగా, లక్ష్యం లేకుండా ఉండేలా దేవుడు తన స్వరూపంలో మనుషులను సృష్టించలేదు. మన రోజులన్నిటికీ ఒక గురి మరియు లక్ష్యాన్ని కలిగి ఉండేలా ఆయన మనల్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు. ఈ రోజు మీ లక్ష్యం ఏమిటి? కొత్త సంవత్సరానికి మీ లక్ష్యం ఏమిటి? ప్రారంభించడానికి ఒక మంచి లేఖనం 1 కొరింథీయులు 10:31, “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”