“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15)

ఇది నాకు ఇష్టమైన క్రిస్మస్ ను గురించిన వాక్య భాగం, ఎందుకంటే యేసు భూమి మీద ఆయన జీవిత ప్రారంభం మరియు ముగింపు, శరీరధారిగా అవతరించడానికి మరియు సిలువకు మధ్య ఉన్న సంబంధాన్ని అంత స్పష్టంగా చూపించే వాక్య భాగం మరొకటి లేదు. యేసు మరణించడానికి వచ్చాడని ఈ రెండు వచనాలు స్పష్టం చేస్తున్నాయి; మీ అవిశ్వాస స్నేహితునికి లేదా కుటుంబ సభ్యులకి క్రైస్తవ కోణంలో  క్రిస్మస్ గురించి వివరించడానికి ఈ వాక్య భాగం చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క మాటను తీసుకొని వివరించవచ్చు:

“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. . . ”

“పిల్లలు” అనే పదం పై వాక్యం నుండి తీసుకోబడింది మరియు మెస్సీయ అను క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక సంతానమును సూచిస్తుంది (యెషయా 8:18; 53:10 చూడండి). అంతే కాకుండా వీరు “దేవునికి పిల్లలే” (యోహాను 1:12). మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తును పంపడంలో, దేవుడు తన “పిల్లల” రక్షణను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకున్నాడు.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా … ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16) అనేది సత్యం. కానీ దేవుడు ప్రత్యేకంగా “చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుతున్నాడు” (యోహాను 11:52) సేకరించడం కూడా నిజం. దేవుని ఉద్ధేశ్యం లోకమునకు క్రీస్తును అందించడం మరియు ఆయన “పిల్లల” రక్షణను ప్రభావితం చేయడం (1 తిమోతి 4:10 చూడండి). మీరు క్రీస్తును స్వీకరించడం ద్వారా కుమారులుగా ఉండటాన్ని అనుభవిస్తారు (యోహాను 1:12).

” . . . ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”

శరీరాధారిగా రావడానికి ముందే క్రీస్తు ఉన్నాడని దీని అర్థం. ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన శాశ్వతమైన వాక్యముగా ఉన్నాడు. ఆయన దేవునితో ఉన్నాడు మరియు ఆయన దేవుడై ఉన్నాడు (యోహాను 1:1; కొలొస్సీ 2:9). కానీ ఆయన రక్తమాంసములను ధరించుకున్నాడు. దైవత్వానికి మానవత్వమనే వస్త్రాన్ని ధరించాడు. ఆయన నిజముగా మానవుడు అయ్యాడు మరియు నిజమైన దేవుడుగా ఉన్నాడు. ఇది అనేక విధాలుగా గొప్ప రహస్యం. కానీ అది మన విశ్వాసానికి ప్రాముఖ్యమైనది మరియు బైబిల్ బోధ.

” . . . మరణముద్వారా. . . ”

మరణించడానికే ఆయన మానవునిగా పుట్టాడు. దేవుడు స్వచ్ఛంగా మరియు సరళంగా, పాపుల కోసం చనిపోలేడు. కానీ మనిషిగా ఆయన చేయగలడు. చనిపోవడమే ఆయన లక్ష్యం. అందుచేత ఆయన మనిషిగా పుట్టవలసి వచ్చింది. ఆయన చనిపోవడానికి పుట్టాడు. గుడ్ ఫ్రైడేనే క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యం. ఈ రోజు చాలా మంది ప్రజలు క్రిస్మస్ గురించి వినవలసినది ఇదే.

” . . . మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును. . . ”

మరణిస్తున్నప్పుడు, క్రీస్తు సాతానును నాశనం చేశాడు. ఎలా? మన పాపాలన్నింటినీ కప్పడం ద్వారా. దేవుని యెదుట మనలను నిందించుటకు సాతానుకు ఎటువంటి న్యాయబద్ధమైన ఆధారాలు లేవని దీని అర్థం. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;” (రోమా 8:33) — ఆయన ఏ ప్రాతిపదికన నీతిమంతులుగా తీర్చుతాడు? యేసు రక్తం ద్వారా (రోమా ​​5:9).

మనకు వ్యతిరేకంగా ఉపయోగించే సాతాను యొక్క అంతిమ ఆయుధం మన స్వంత పాపమే. యేసు మరణం దానిని తీసివేస్తే, సాతాను యొక్క ప్రధాన ఆయుధం – అతని వద్ద ఉన్న ఒక మర్త్య ఆయుధం – అతని చేతిలో నుండి తీసివేయబడుతుంది. అతను మా మరణశిక్ష కోసం కేసు పెట్టలేడు, ఎందుకంటే న్యాయమూర్తి తన కుమారుడి మరణం ద్వారా మనల్ని నిర్దోషిగా ప్రకటించాడు!

” . . . జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును”

కాబట్టి, మనం మరణ భయం నుండి విముక్తి పొందాము. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. సాతాను ఆ శాసనాన్ని రద్దు చేయలేడు. దేవుడు మన అంతిమ భద్రత అనే సత్యం మన జీవితాలపై తక్షణ ప్రభావం చూపుతుంది. దేవుడు మన సంతోషకరమైన ముగింపు అనే సత్యం ప్రస్తుత బానిసత్వం మరియు భయం నుండి విడుదలనిస్తుంది. 

మన చివరి మరియు గొప్ప శత్రువు అయిన మరణానికి భయపడాల్సిన అవసరం లేకపోతే, మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. మనం స్వేచ్ఛగా ఉండగలం. ఈ స్వేచ్ఛ మనకు ఆనందాన్నిస్తుంది. ఇతరులకు ఆనందానిస్తుంది.

దేవుడు మనకు ఇచ్చిన గొప్ప క్రిస్మస్ కానుక! మరియు మన నుండి లోకమంతటికి!

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *