“రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి”. (మత్తయి 2:1–2)

లూకా సువార్తలో చెప్పినట్లుగా, గొర్రెల కాపరులు శాలలో యేసును సందర్శించడానికి వస్తున్నారని మత్తయి మనకు చెప్పలేదు. యేసును ఆరాధించడానికి తూర్పు నుండి వస్తున్న విదేశీయులపై అనగా – యూదులు కాని అన్యులపై అతని దృష్టి ఉంది.

కాబట్టి, మత్తయి తన సువార్త ప్రారంభంలో, ముగింపులో యేసును యూదులకే కాకుండా అన్ని దేశాలకు సార్వత్రిక మెస్సీయాగా చూపించాడు.

ఇక్కడ మొదటి ఆరాధకులు ఆస్థాన మాంత్రికులు, లేదా జ్యోతిష్కులు లేదా జ్ఞానులు ఇశ్రాయేలు నుండి కాదు కానీ తూర్పు నుండి వచ్చారు – బహుశా బబులోను నుండి వచ్చిన వారు. వారు అన్యులు. పాత నిబంధన ప్రకారం అపవిత్రులు.

మత్తయి చివరిలో, యేసు యొక్క చివరి మాటలు ఇవి, “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;” (మత్తయి 28:18-19).

ఇది అన్యజనులమైన మనకు మెస్సీయాలో సంతోషించుటకు మాత్రమే తలుపును తెరవలేదు; ఇది ఆయన మెస్సీయ అనడానికి రుజువును కూడా జోడించింది. ఎందుకంటే, దేశాలు మరియు రాజులు, వాస్తవానికి, ప్రపంచానికి పాలకుడిగా ఉన్న ఆయన యొద్దకు వస్తారని పదేపదే ప్రవచనాలలో చెప్పబడింది. ఉదాహరణకు, యెషయా 60:3, “జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.”కాబట్టి మత్తయి, యేసు మెస్సీయ అని అనడానికి రుజువును జోడించాడు మరియు ఆయనే మెస్సీయ అని చూపాడు. ఇశ్రాయేలుకి మాత్రమే కాకుండా అన్ని దేశాలకు రాజు మరియు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *