“వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను”. (లూకా 2:6–7)
మరియ యోసేపులను బెత్లెహేముకు తీసుకురావడానికి ప్రపంచ జనాభా సేకరణను ఉపయోగించేలా దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తే, ఆయన ఖచ్చితంగా సత్రంలో ఒక గది అందుబాటులో ఉండేలా చూడగలడని మీరు అనుకుంటారు.
అవును, ఆయన అలా చేయగలడు. ఆయన ఖచ్చితంగా అలా చేయగలడు! మరియు యేసు ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. ఆయన అరణ్యంలో రాయిని రొట్టెగా మార్చగలడు. ఆయన గెత్సమనేలో తన సహాయానికి 10,000 మంది దేవదూతలను పిలిచి ఉండవచ్చు. ఆయన సిలువ నుండి దిగి తనను తాను రక్షించుకొని ఉండవచ్చు. దేవుడు ఏమి చేయగలడు అనేది కాదు, కానీ ఆయన ఏమి చేయాలనుకున్నాడు అనేదే ప్రశ్న.
దేవుని చిత్తం ఏమిటంటే, క్రీస్తు ధనవంతుడు అయినప్పటికీ, మీ కొరకు ఆయన పేదవాడు అయ్యాడు. బెత్లెహేములోని వసతి గృహాలన్నీ”ఖాళీ లేదు” అని బోర్డు పెట్టడానికి కారణం మీరే. ఆయన “మీ నిమిత్తము దరిద్రుడాయెను” (2 కొరింథీయులకు 8:9).
దేవుడు తన పిల్లల కోసం అన్నింటినీ అవి హోటల్స్ కావచ్చు లేదా సత్రాలు కావచ్చు అన్నింటినీ ఏలేవాడు. కల్వరి మార్గం బెత్లెహేములో “నో వేకెన్సీ” గుర్తుతో ప్రారంభమై యెరూసలేంలో సిలువను బట్టి ఉమ్మివేయడం మరియు అపహాస్యం చేయడంతో ముగుస్తుంది.
“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.” (లూకా 9:23) అని ఆయన చెప్పినట్లు మనం మరచిపోకూడదు.
మనము కల్వరి మార్గంలో ఆయనను కలిసి “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; ” (యోహాను 15:20) అని ఆయన చెప్పిన మాటలును వినబద్దులమై ఉన్నాము.
“నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని” ఉత్సాహంగా చెప్పిన వ్యక్తికి యేసు ఈ విధంగా ప్రతిస్పందించాడు, ” నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను” (లూకా 9:57-58).
అవును, యేసు పుట్టినప్పుడు ఒక గది ఉండేలా దేవుడు చూడగలిగే వాడే. కానీ అది కల్వరి మార్గం నుండి పక్కదారి పట్టిస్తుంది.