“ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను”. (లూకా 2:1–5)
మెస్సీయ బెత్లెహేములో జన్మించాలని దేవుడు ముందుగా నిర్ణయించడం ఎంత అద్భుతమైన విషయమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా (మీకా 5:2లోని ప్రవచనం చెప్తున్నట్లుగా); సమయం వచ్చినప్పుడు, మెస్సీయ తల్లి మరియు చట్టబద్ధమైన తండ్రి బెత్లెహేములో కాకుండా నజరేతులో నివసించేలా దేవుడు ఏర్పాటు చేశాడు; దేవుడు తన మాటను నెరవేర్చడానికి మొదటి క్రిస్మస్ సందర్భంగా అనామకులైన, సామాన్యులైన, అల్పులైన ఇద్దరిని బెత్లెహేముకు తీసుకురావడానికి, రోమా సామ్రాజ్యములోని ఒక్కొక్కరిని తన సొంత పట్టణంలో నమోదు చేసుకోవాలనే ఆలోచనను దేవుడు కైసరు ఔగుస్తు హృదయంలో ఉంచాడా? ఇద్దరు వ్యక్తులను డెబ్బై మైళ్ల దూరం తరలించడానికి ప్రపంచం మొత్తానికి ఒక ఆజ్ఞ! ఇవ్వబడింది.
గొప్ప గొప్ప రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్యమాల గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గల, బలం, పలుకుబడి ఉన్న అత్యద్భుతమైన వ్యక్తుల గురించి నిరంతరము వార్తలుగా వినే ఏడు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో నాలాగా మీరు కూడా చాలా చిన్నవారని తక్కువవారని ఎప్పుడైనా భావించారా?
మీరు అలా ఆలోచిస్తూ ఉంటే, ఆ ఆలోచన మిమ్మల్ని నిరుత్సాహానికి లేదా అసంతృప్తికి గురి చేయనివ్వవద్దు. ఎంత పెద్ద రాజకీయ శక్తులయినా మరియు ఎంత పెద్ద పారిశ్రామిక సముదాయాలు అయినా, వారికి కూడా తెలియకుండానే, దేవునిచే మార్గనిర్దేశం చేయబడుతున్నారు. వారి కొరకు కాదు, కానీ దేవుని సామాన్య ప్రజల కోసం – అల్పులైన మరియ యోసేపులు నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళడం కొరకు, దేవుడు తన మాటను నెరవేర్చడానికి మరియు తన పిల్లలను ఆశీర్వదించడానికి ఒక సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు.
మీరు ఈ చిన్న ప్రపంచంలో మీరు కష్టాలను అనుభవిస్తున్నందున, ప్రభువు యొక్క హస్తం కుదించబడిందని అనుకోకండి. మన శ్రేయస్సు లేదా మన కీర్తిని కాదు, మన పవిత్రతను ఆయన తన పూర్ణ హృదయంతో కోరుకుంటున్నాడు. ఆ దిశగా, ఆయన మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. సామెతలు 21:1 చెప్పినట్లు, “యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.” మరియు ఆయన ఎల్లప్పుడూ తన ప్రజల రక్షణ, పవిత్రీకరణ మరియు శాశ్వతమైన ప్రయోజనాల కోసం దానిని త్రిప్పుతాడు.మన దేవుడు దీనులకు గొప్ప దేవుడు. మరియు మనకు తెలియకుండానే, ప్రపంచంలోని రాజులు, అధ్యక్షులు, ప్రధానులు మరియు విశ్వవిద్యాలయాధ్యక్షులు మరియు నాయకులు అందరూ పరలోకంలో ఉన్న మన తండ్రి యొక్క సార్వభౌమాధికార శాసనాలను అనుసరిస్తున్నారనే సత్యం మనం సంతోషించడానికి గొప్ప అతిశయ కారణంగా ఉంది. ఆయన పిల్లలుగా ఉన్న మనం, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని – ఆపై ఆయన శాశ్వతమైన మహిమలోకి ప్రవేశించాలని దేవుడు ఇలా చేస్తున్నాడు.