ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట [దేవునికి న్యాయమే]. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరయందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. (2 థెస్స 1:7-10).
యేసు తాను వాగ్దానం చేసినట్లుగానే ఈ భూమి మీదకి ఆయన తిరిగి వచ్చినప్పుడు, సువార్తను నమ్మనివారందరు, “ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు” అని పౌలు చెప్పాడు. ఈ సత్యాన్ని వినే అవిశ్వాసులందరినీ భయపెట్టే అతి భయంకరమైన పరిస్థితి ఇది.
అయ్యో, ఈ లోకంలో ప్రమాదకరమైనదానిని నమ్మి, తీవ్ర భయంతో నింపబడుతున్నప్పుడు ఏది నెమ్మదిపరుస్తుంది. అయ్యో, కనీసం సువార్తను నమ్మని లేదా సువార్తంటే తెలియని వారిపట్ల అది మన హృదయాలలో కనికరాన్ని ఎలా పెంచుతుంది.
అయితే, మన శ్రమలన్నిటిలో మనల్ని సంరక్షించడానికి నిరీక్షణ మరియు ప్రోత్సాహం గురించి రెండు అద్భుతమైన మాటలను పౌలు మనకు ఇక్కడ ఇస్తున్నాడు. “శ్రమ పొందుతున్నవారికి [దేవుడు విశ్రాంతిని ఇస్తాడు].” చరిత్ర ముగిసే సమయానికి మనం ఎంతో తీవ్రమైన శ్రమలను అనుభవించినప్పుడు, స్థిరంగా ఉండండి: విశ్రాంతి అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం చెబుతోంది. మీ శ్రమలకు చివరి మాట ఉండదు. మీకు శక్తివంతంగా కనబడుతున్న మీ శత్రువులందరూ ప్రభువు ప్రజలను తాకిన రోజున పశ్చాత్తాపపడతారు.
అయితే, ఆ తర్వాత నిరీక్షణ మరియు ప్రోత్సాహానికి సంబంధించిన ఉత్తమ మాట ఉంది. ప్రభువు వచ్చినప్పుడు విశ్రాంతిని పొందుకోవడమే కాకుండా మనం ప్రథమ స్థానంలో సృష్టించబడ్డామనే గొప్ప అనుభవాన్ని పొందుకుంటాం, అంటే మనం ఆయన మహిమను చూస్తాం, లోకమంతా చూస్తుండగా ఆయన మనలో మహిమ పొందుతున్నాడనే విధానంలో ఆశ్చర్యపోతూ ఉంటాం.
10వ వచనంలో, “ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వస్తాడు” అని ఉంది. మనం ఆశ్చర్యపోవడానికి సృష్టించబడ్డాం. సిలువ వేయబడి, లేచిన, మహిమగల రాజు యేసుక్రీస్తును మించిన ఆశ్చర్యకరుడు మరొకరు లేరు. ఆయన తన మహిమ యొక్క గమ్యాన్ని పొందుతాడు, మరియు పరిపూర్ణమైన, పాపరహితమైన, అత్యద్భుతమైన మహిమను చూసి అంతులేని మహిమను అనుభవిస్తూ, మన ఆనందం యొక్క గమ్యాన్ని చేరుతాం.