దేవుని సార్వభౌమాధికార శక్తిలో నిశ్చయత కలిగి జీవించండి

దేవుని సార్వభౌమాధికార శక్తిలో నిశ్చయత కలిగి జీవించండి

షేర్ చెయ్యండి:

“విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో”,…. (ఎఫెసీ 1:19)

దేవుని సర్వశక్తి స్వభావమనేది ప్రాపంచిక స౦ఘటనలతో సంబంధం లేకుండా ఆయన నిత్య మహిమలో శాశ్వతమైన, అచంచలమైన ఆశ్రయాన్ని ఇస్తు౦ది. ఆ నిశ్చయతే దేవుని పిలుపుకు, తీవ్రమైన విధేయతకు శక్తియైయున్నది.

రోజంతా మరియు ప్రతిరోజూ, సాధారణ మరియు అసాధారణ అనుభవాలన్నిటిలో సర్వశక్తిమంతుడైన దేవుడే మీకు ఆశ్రయమనే సత్యాన్ని మించిన స్వాతంత్ర్యం, ఉత్సాహం లేదా మరింత ఎక్కువగా బలపరిచేది జీవితంలో ఏదైనా ఉందా? 

ఈ విషయాన్ని మనం నమ్మినట్లయితే, దేవుని సర్వశక్తికి సంబంధించిన ఈ సత్యం మనల్ని పట్టుకుంటే, మన వ్యక్తిగత జీవితాలలో మరియు మన పరిచర్యలలో ఎంత పెను మార్పు వస్తుందో! దేవుని రక్షించే ఉద్దేశాల కోసం మనం ఎంత వినయంగా, ఎంత శక్తివంతంగా మారిపోతామో! 

దేవుని సర్వశక్తి అంటే దేవుని ప్రజలకు ఆశ్రయం అని అర్థం. మీ ఆశ్రయం సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తియని మీరు నిజంగా నమ్మినప్పుడు, యేసు క్రీస్తుకు తీవ్రమైన విధేయతను చూపించే జీవితములో ఆనందం, స్వాతంత్ర్యం మరియు శక్తి అనేవి పొంగిపొర్లుతుంటాయి. 

దేవుని సర్వశక్తి అంటే ఆయన నిబ౦ధన ప్రజలకు భక్తి భావం, ప్రతిఫల౦, ఆశ్రయ౦ అని అర్థ౦. 

ఆయన కృపా నిబందనలోని షరతులను అంగీకరించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: పాపము నుండి వైదొలగి, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి; సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తి, మీ అంతరంగానికి పూజనీయంగా ఉండాలి, మీ శత్రువులకు ప్రతిఫలంగా ఉండాలి మరియు మీ జీవితానికి శాశ్వతమైన ఆశ్రయంగా ఉండాలి. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...