శిష్యత్వం అంటే ఏమిటి? 

శిష్యత్వం అంటే ఏమిటి? 

షేర్ చెయ్యండి:

శిష్యత్వం ముఖ్యంగా బోధన మరియు అనుకరణ ద్వారా పనిచేస్తుంది. అలాగే ప్రేమ ద్వారా ఉత్తమంగా పనిచేస్తుంది. మనం యువతీయువకులైన విశ్వాసులకు దైవభక్తితో కూడిన మార్గం గూర్చి ప్రేమపూర్వకంగా బోధిస్తూ, మెచ్చుకోదగిన జీవితం జీవిస్తునప్పుడు, వారు మన జీవితాన్ని మరియు సిద్ధాంతాన్ని అనుకరిస్తూ క్రీస్తును పోలి ఎదుగుతుంటారు (1 తిమోతి 4:16 చూడుము). శిష్యత్వంలో ఏం కలగలిపి ఉంటాయో ఒక్కొక్కటిగా ఈ కింద చూద్దాం.

బోధన: సంఘకాపరులకు తలిదండ్రులకు అప్పగింపబడినవారికి వారు బోధించాలని వాక్యం చెప్తుంది (సామెతలు; గలతీ 6:6; ఎఫెసీ 6:4; 1 థెస్స 4:8; 1 తిమోతి 1:18, 6:3; 2 తిమోతి 2:25; 4:2). విశ్వాసులందరు కూడ ఒకరికొకరు బోధించుకోవాలని వాక్యం ఆజ్ఞాపిస్తుంది (రోమా 15:14).

అనుకరణ: క్రైస్తవులు అనుకరించువారై యున్నారు. వారు మొదట దేవున్ని అనుకరిస్తారు, ఆ తరువాత ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తారు. వినుట మరియు అనుకరించుట ద్వారా మనం దేవుని కృపలో ఎదుగుతుంటాము. ఈ క్రింది వాక్యభాగాలను గమనించండి:

–  ‘‘నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్నును పోలి నడుచుకొనుడి’’ (1 కొరింథీ 11:1)

–   ‘‘మీరు దేవుని వాక్యము బోధించి, మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి’’ (హెబ్రీ 13:7)

–  ‘‘మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై యుండును’’ (ఫిలిప్పీ 4:9)

–  ‘‘అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి’’ (2 తిమోతి 3:10-11)

–  ‘‘ప్రియుడా, చెడు కార్యమును కాక, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము’’ (3 యోహాను వ11)

ప్రేమ: నీవు మనుష్యులను ప్రేమింపకపోయినప్పటికిని వారు నీ జీవితాన్ని అనుకరిస్తుంటారు. గాని ప్రేమతో నడిపించే నాయకుడు క్రీస్తు యొక్క ఉత్తమ మాదిరిని కనుపరుస్తుంటాడు. మరియు నీవు మనుష్యులను ప్రేమించినప్పుడు వారు నిన్ను ఎంతో ప్రేమతో అనుసరిస్తారు.

స్నేహం: ఒక విధంగా, శిష్యత్వమనేది స్నేహం. అనగా ఈ స్నేహం క్రీస్తు నొద్దకు నడిపించేదిగా ఉంటుంది. స్నేహితులేంచేస్తారు? వారు ఒకరినొకరు అనుకరిస్తారు. శిష్యత్వంలో, వారు క్రీస్తును పోలి ఎదగడానికి మరియు క్రీస్తును పోలి ఎదుగునట్లు వారికి సహాయం చేయడానికి మనం ఇతరులతో స్నేహం చేస్తాము.

అలాగైతే, ఒక శిష్యుడిగా మనం ఎలా ఉండాలి?

(1) పరిపక్వత కలిగిన క్రైస్తవులని గమనించాలి. వారు  పనులు చేసే, విశ్రాంతి తీసికొనే, కుటుంబాన్ని పోషిస్తూ నడిపించే, ఘర్షణలతో వ్యవహరించే, పొరుగువారికి సువార్త చెప్పే, శోధన బాధల్లో పట్టువదలక ఉండే, సంఘంలో సేవచేసే, లేదా పాపమును జయించుటకు పోరాడే విధానాలను  గమనించాలి మరియు వినాలి.

(2) అంతే కాదు, వారి వాక్యానుసారమైన విధానాలను అనుకరించాలి!

శిష్యత్వమంటే ఇదే!

9 మార్క్స్

9 మార్క్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...