“మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనే గాని, భూసంబంధమైనవాటి మీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది”. (కొలొస్స 3:1-2)
యేసు క్రీస్తు విశ్రాంతినిస్తాడు. కాబట్టి, పైనున్న వాటిని వెదకండి. ఈ వేసవిలో చిన్న చిన్న వస్తువులతో క్రీస్తు స్థానాన్ని బదిలీ చేయవద్దు. క్రీస్తు నుండి క్రీస్తులేనటువంటి విశ్రాంతిలోనికి పయనించడం ద్వారా ఆత్మ క్షీణించిపోతుంది.
ప్రార్థనను విస్మరించడం మరియు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడమనేది మొదట్లో స్వేచ్చగాను, వినోదంగాను అనిపించవచ్చు గాని నిస్సారత, శక్తిహీనత, పాపానికి గురికావడం, అల్పమైన విషయాలపట్ల వ్యామోహం కలిగి ఉండడం, నిస్సారమైన సంబంధాలను కలిగి ఉండడం, ఆరాధన మరియు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తిని కోల్పోవడం లాంటి వాటిని బట్టి మనం తప్పకుండా బాధపడతాం.
వేసవి కాలంలో మీ ఆత్మను కృంగుదలకు గురి కానివ్వకండి. దేవుడు వేసవి కాలాన్ని పరలోకానికి మచ్చుతునకగా పెట్టాడు గాని పరలోకానికి ప్రత్యామ్నాయంగా పెట్టలేదు.
మీ కాబోయే భర్త నుంచి వచ్చిన ప్రేమలేఖను పోస్ట్ మ్యాన్ మీకు తీసుకు వచ్చిస్తే, పోస్ట్ మ్యాన్ తో ప్రేమలో పడకండి. వీడియో ప్రివ్యూ చూసి ప్రేమలో పడి, రాబోయే వాస్తవికతను ప్రేమించలేని స్థితిలో ఉండిపోకండి.
వేసవి కాలంలో ఇచ్చే విశ్రాంతికి యేసు క్రీస్తు కేంద్రమైయున్నాడు. సెలవులు, పిక్నిక్ లు, సాఫ్ట్ బాల్, సుదీర్ఘ నడకలు మరియు వంటలతో సహా అన్ని విషయాలలో ఆయన ప్రాముఖ్యతను పొందియున్నాడు (కొలొస్స 1:18). “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి 11:28) అని ఈ వేసవిలో ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.
ఈ విశ్రాంతి మనకు కావాలా? అనేది ప్రశ్న. ఆయన ఇచ్చే విశ్రాంతిని మనం ఎంతగా కోరుకుంటున్నామో అంతగా ఆయన తననుతాను మన కోసం అప్పగించుకున్నాడు. “మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు” (యిర్మియా 29:13).
ఈ విషయం గురించి, “ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి” (ఆపొ. కార్య 3:19-20) అని పేతురు మనతో చెబుతున్నాడు. మారుమనస్సు (పశ్చాత్తాపం) అనేది పాపం నుండి వెనక్కి తిరగడమే కాదు గాని తెరవబడిన హృదయాలతో, ఆశతో, లోబడే తత్వంతో ప్రభువు వైపు తిరగడం.
ఇది ఎలాంటి వేసవి కాలపు ఆలోచన విధానం? ఇది ఎలాంటి ఆలోచన విధానమంటే, “మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనే గాని, భూసంబంధమైనవాటి మీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది” అని చెప్పిన కొలొస్స 3:1-2లో ఉన్న ఆలోచనా విధానం.
ఇది దేవుని యొక్క భూమి! “ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము” (ప్రకటన 21:23) అని నిత్యత్వపు వేసవి కాలం యొక్క నిజతత్వాన్ని తెలిపే వీడియో ప్రివ్యూ ఇది.
వేసవి కాలపు సూర్యుడు దేవుని మహిమకు సూచకమైయున్నాడంతే. వేసవి కాలం అనేది చూడటానికి మరియు చూపించడానికి మాత్రమే. చూడటానికి మీకు కళ్ళు కావాలా? ప్రభువా, వెలుగుకు అతీతమైన వెలుగును చూడటానికి మాకు సహాయం చేయండని కోరుకోండి.
Wonderful message good 🙏