ఐదు సాంకేతిక (డిజిటల్) ప్రమాదాలు
“మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి”. (రోమా 13:14)
ఆధునిక సమకాలీన సంస్కృతి ప్రవాహంలో తీరానికి కొట్టుకొనివచ్చిన జెల్లీ ఫిష్ లాగా క్రైస్తవులు జీవితాన్ని సముద్ర తీరంలో ఎటువంటి కదలికలు లేకుండా గడపరు గాని ఎక్కువ చురుకుగా ఉంటారు. మనము ఆత్మ శక్తిచేత జీవిస్తాం, దేవుని వాక్యము ద్వారా మన మార్గాన్ని కనుగొంటాం. జెల్లీ ఫిష్ లాగా కాకుండా డాల్ఫిన్లవలె మనం ఈత కొడుతాం. నేటి డిజిటల్ ప్రపంచంతో ఆలోచనాత్మకమైన ప్రమేయం ద్వారా ఆ దిశ మరియు ప్రభావంలో కొంత భాగం చూపబడుతుంది. అందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇక్కడ అటువంటి ఐదు ప్రమాదాలు చెప్పబడియున్నాయి.
1. నిరంతర కుతూహలంతో ఉండిపోయే కొండి
అన్వేషించడం కోసం డిజిటల్ వస్తువులు నిరంతర అవకాశాలను అందిస్తూనే ఉంటాయి. ప్రాథమిక ఆపరేటింగ్ సిస్టంలు కూడా కుతూహలంతో కూడిన వెతుకులాటను మరియు ప్రయోగాల కోసం గంటల తరబడి సమయాన్ని లాగేస్తుంటాయి. ఆ తర్వాత, లెక్కలేనన్ని యాపులు మీ సమయాన్ని వారాల తరబడి లాగేస్తాయి, వాటి చిక్కుల్లోకి మిమ్మల్ని నెడుతుంటాయి.
ఇవన్నీ చాలా మోసపూరితమైనవి, శక్తి సామర్థ్యాల భ్రమను ఎక్కువగా ఇస్తుంటాయి గాని చివరికి అవి మిమ్మల్ని ఒంటరితనానికి మరియు ఆందోళనకు గురిచేస్తుంటాయి.
తీర్మానం: నేను వాడే పరికరం మీద చాలా ఖచ్చితంగా నా సమయాన్ని తగ్గించుకొని, టెక్నిక్ కంటే ఎక్కువగా సత్యానికి నన్ను నేను సమర్పించుకుంటాను.
2. అ(వాస్తవ) విషయాలతో నిండిన శూన్య ప్రపంచం
వాస్తవిక విషయాలతో సంబంధం లేనటువంటి పట్టణాలను, సైన్యాలను మరియు సాహసోపేతమైన విషయాలను సృష్టించడానికి తెలివైన, సృజనాత్మకతను కలిగిన ప్రజలు జీవితంలో లెక్కలేనన్ని గంటల్ని, రోజుల్ని గడపడం చాలా బాధాకరమైన విషయం. మనకు జీవించడానికి ఒకే ఒక జీవితం ఉంది. నిజమైన పరలోకానికి, నిజమైన నరకానికి దారి తీసేటువంటి నిజమైన ప్రపంచం కోసం నిజమైన దేవుని ద్వారా సమస్త శక్తులు మనకివ్వబడ్డాయి.
తీర్మానం: నేను నాకున్న నిర్మాణాత్మక, సృజనాత్మక శక్తిని “కాల్పనికమైన వాస్తవికత” యొక్క అవాస్తవికతలో కాకుండా వాస్తవ ప్రపంచం యొక్క వాస్తవికతలో వెచ్చిస్తాను.
3. యంత్రంతో “వ్యక్తిగత” సంబంధాలు
మరే ఇతర ఆవిష్కరణవలె కాకుండా, ఒక వ్యక్తిలా ఉండే స్థితికి కంప్యూటర్ మనుష్యులకు చాలా దగ్గరయ్యింది. మీరు దానితో ఆటలు ఆడవచ్చు. అది మీతో మాట్లాడుతుంది. అది మీ కోసం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడున్న పెద్ద ప్రమాదం ఏంటంటే నిర్వహించదగిన ఎలక్ట్రానిక్ “వ్యక్తితో” మనం నిజంగా సౌకర్యవంతంగా ఉండడం మరియు నిజమైన మనుష్యులతో అనూహ్యమైన, నిరాశపరిచే, కొన్నిసార్లు బాధాకరమైన వ్యవహారాల నుండి క్రమంగా దూరమవుతూ ఉండడం.
తీర్మానం: వ్యక్తిగత సంబంధాల అపాయాన్ని నేను వ్యక్తిగత ఎలక్ట్రానిక్ భద్రతతో బదిలీ చేయను.
4. కలవడానికి నిర్ణయం తీసుకునేందుకు సంబంధించిన అపాయం
“ట్రిస్ట్ (కలవడానికి నిర్ణయం తీసుకోవడానికిగల అపాయం): కలవడానికి (ఇద్దరు ప్రేమికులు) తీసుకునే ఒప్పందం.” లైంగిక వ్యవహారాలనేవి వ్యక్తిగతంగా సమయాన్ని కలిసి వెచ్చించడంలోను, సుదీర్ఘ సంభాషణలు చేసినప్పుడు, మనస్సులను పంచుకున్నప్పుడు ఆరంభించబడతాయి. ఇవి ఇప్పుడు ఎక్కడ వారు అక్కడ ఉండి డిజిటల్ పరికరాల ద్వారా పూర్తిగా రహస్యంగా జరిగించవచ్చు. ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని ఊరులో కనబడేంతవరకు “ఇందులో ఏముందిలే” అని మీరు ఆలోచించవచ్చు.
తీర్మానం: నా జీవిత భాగస్వామితో కాకుండా మరి ఏ అమ్మాయితోను (అబ్బాయితోనూ) వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉండను. ఒకవేళ నాకు వివాహం కాకపోతే, ఇతర వ్యక్తి భార్యతో గాని లేక భర్తతో గాని సంబంధం పెట్టుకోను.
5. అశ్లీలత
మరింత ఎక్కువ మోసపూరితమైన ఎక్స్-రేట్ వీడియోలను మనమిప్పుడు చూడటమే కాకుండా, మన స్వంత బోనులోనికి వెళ్లి, రహస్యంగా విచ్చలవిడితనాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. ఒకరితో ఒకరు అశ్లీలంగ ప్రవర్తించడం అనేది మీరు వాస్తవికంగా దానిని “చేసే విధంగా” చేస్తుంది, లేక అవతల వాళ్ళు దానిని “చేసే విధంగా” చేస్తుంది.
దీనిని నేనెప్పుడూ చూడలేదు. నేనెప్పుడూ చేయదలచుకోలేదు. ఇది ఆత్మను చంపేస్తుంది. ఇది దేవుణ్ణి ప్రక్కకు నెట్టేస్తుంది. ఇది మహిళలను కించపరుస్తుంది. ఇది ప్రార్థనను చల్లబరుస్తుంది. ఇది బైబిలును శూన్యంగా చేస్తుంది. ఇది ఆత్మను చౌకగా చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని నాశనం చేస్తుంది. ఇది ప్రతిదాన్ని అపవిత్రం చేస్తుంది.
తీర్మానం: నేనిక లైంగిక ప్రేరణ కోసం ఎటువంటి యాప్ ను గాని లేక వెబ్ సైటును గాని తెరవను, వాటిని కొనను, అశ్లీలతకు సంబంధించిన వాటిని డౌన్ లోడ్ చేసుకొనను.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web