యేసును హత్తుకోవడం
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే”. (1 యోహాను 5:3-4)
గమనించండి: దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం మాత్రమే కాదు. ఇది దేవుని పట్ల ఒక రకమైన హృదయాన్ని కలిగి ఉండడమే అనగా ఆజ్ఞలను పాటించడం భారమైనది కాదు అని యోహాను చెప్పేది అదే. కానీ తరువాత అతను ఆ సత్యాన్ని ప్రేమ పరంగా కాకుండా నూతన జన్మ మరియు విశ్వాసం పరంగా చెబుతున్నాడు. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు”. అని అక్కడతో ఆపేయకుండా దేవుని ఆజ్ఞలు ఎందుకు భారమైనవి కావో వివరిస్తున్నాడు: “దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; కాబట్టి, భారం లేకుండా దేవుని ఆజ్ఞలను పాటించడానికి లోకానుసారమైన అడ్డంకులను అధిగమించేది నూతన జన్మ.
చివరిగా, “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే”. అని జతచేస్తున్నాడు. కాబట్టి, నూతన జన్మ భారం లేని ఆజ్ఞ-నిర్వహణకు లోకానుసారమైన అడ్డంకులను అధిగమిస్తుంది. ఎందుకంటే నూతన జన్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి, అద్భుతమైన నూతన జన్మ విశ్వాసాన్ని సృష్టిస్తుంది. ఇది క్రీస్తులో దేవుడు మనకు ఏమై ఉన్నాడో అది అత్యంత సంతృప్తికరమైనదిగా స్వీకరించేలా చేస్తుంది. ఇది ప్రపంచంలోని ప్రలోభాల కంటే దేవునికి విధేయతను మరింతగా కోరుకునేలా చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే అదే.
పద్దెనిమిదవ శతాబ్దపు పాస్టర్ మరియు వేదాంతవేత్త జోనాథన్ ఎడ్వర్డ్స్ ఈ వచనంతో కుస్తీ పట్టి ఇలా ముగించారు, “రక్షించే విశ్వాసం అంటే . . . ప్రేమ. . . . దేవుని పట్ల మనకున్న ప్రేమ, దేవుని ఆజ్ఞలను పాటించడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి మనకు సహాయం చేస్తుంది – ఈ రక్షించే విశ్వాసంలో ప్రాముఖ్యమైనది ప్రేమే. జీవము మరియు శక్తిగల విశ్వాసమే గొప్ప మార్పులకు కారణం.
ఎడ్వర్డ్స్ గారు చెప్పింది సరైనదేనని నేను భావిస్తున్నాను మరియు బైబిల్‌లోని అనేక గ్రంథాలు అతను చెప్పేదానికి మద్దతు ఇస్తున్నాయి.
వేరేలా చెప్పాలంటే, క్రీస్తులో విశ్వాసం అంటే దేవుడు మన కోసం ఏమైఉన్నాడో అంగీకరించడమే కాదు, క్రీస్తులో ఆయన మనకు ఏమై ఉన్నాడో దానిని హత్తుకోవడం. “నిజమైన విశ్వాసం లేఖనాలు ఘోర పాపులమైన మనకు క్రీస్తు ఏమై ఉన్నాడని చెబుతున్నాయో వాటినన్నింటిని హత్తుకుంటుంది” – ఇది ఎడ్వర్డ్స్ చెప్పిన మరొక విషయం. ఈ “హత్తుకోవడం” అనేది క్రీస్తు పట్ల మనకున్న ఒక రకమైన ప్రేమ- ఆయనను అన్నిటికంటే ఎక్కువ విలువైనవాడుగా పరిగణించే ప్రేమ.
కాబట్టి, 1 యోహాను 5:3లో ఒక వైపు, దేవుని పట్ల మనకున్న ప్రేమ ఆయన ఆజ్ఞలను పాటించేలా చేస్తుంది అని చెప్తూ 4వ వచనంలో మరోవైపు, మన విశ్వాసం దేవుని ఆజ్ఞలు పాటించకుండా మనల్ని అడ్డుకునే లోకానుసారమైన అడ్డంకులను అధిగమిస్తుంది అని చెప్తున్నాడు. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి కావు. దేవుడు మరియు క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసంలో అంతర్లీనంగా ఉంటుంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web