“వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు”. (ఎఫెసీ 2:3-5)

గాబ్రియేలు దేవదూత మీతో “నీవు బహు ప్రియుడవు” అని చెప్పడం నీకు ఇష్టం లేదా?

దానియేలుకు ఇలా మూడుసార్లు జరిగింది.

  • “నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను;” (దానియేలు 9:23)
  • “దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకుపంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలిసికొనుమనెను;” (దానియేలు 10:11)
  • మరియు అతను ఇలా అన్నాడు, “అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము. నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. (దానియేలు 10:19)

నేను ప్రతి సంవత్సరం బైబిలు చదువుతున్నప్పుడు ఈ వచనాలు వచ్చినప్పుడు, నేను వాటిని తీసుకొని వాటిని నాకు అన్వయించాలనుకుంటాను. దేవుడు “నీవు బహు ప్రియుడవు” అని నాతో చెప్తుంటే నేను వినాలనుకుంటున్నాను.

నిజానికి, నేను దీన్ని వింటున్నాను. నీవు కూడా వినవచ్చు. మీకు యేసుపై విశ్వాసం ఉంటే, దేవుడే తన వాక్యంలో “నీవు బహు ప్రియుడవు” అని నీకు చెప్తున్నాడు. ఇది దేవుని దూత మాట్లాడటం కంటే చాలా ఖచ్చితమైనది.

ఎఫెసీ 2:3-5,8 లో ఇలా ఉంది: “కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చిన వారమైయుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు… మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు;”

మహాప్రేమ” అనే అద్భుతమైన పదాన్ని పౌలు ఈ ఒక్క చోటే ఉపయోగిస్తున్నాడు. ఇది దేవదూత స్వరం కంటే మెరుగైనది. యేసే సత్యవంతుడని నీవు నమ్మి, ఆయనను నీ అత్యున్నత ఐశ్వర్యమని స్వీకరించినట్లయితే, అంటే, నీవు “తిరిగి జన్మించినట్లయితే”, నీవు బహు ప్రియుడవు. అనగా విశ్వం యొక్క సృష్టికర్త ద్వారా గొప్పగా ప్రేమించబడడం. ఒక్కసారి ఆలోచించు! నీవు గొప్పగా ప్రేమించబడ్డావు!

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *