మనకి ఆదరణ ఎక్కడ నుండి వస్తుంది

మనకి ఆదరణ ఎక్కడ నుండి వస్తుంది

షేర్ చెయ్యండి:

పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి – నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు – నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను”. (యోహాను 19: 9-11)

యేసును సిలువ వేయడానికి పిలాతుకు అధికారం ఉన్నప్పటికీ అది యేసును భయపెట్టలేదు. ఎందుకు భయపెట్టలేదంటారు?

పిలాతు అబద్ధం చెప్పాడని కాదు మరియు యేసును సిలువ వేయడానికి అతనికి అధికారం లేదని కాదు. వాస్తవానికి అతనికి అధికారం ఉంది అందుకే యేసుని సిలువ వేశాడు.

పిలాతుకు ఉన్న అధికారం ఇవ్వబడినది కాబట్టి ఆ విషయంలో యేసుకు భయం లేదు. “అది పై నుండి (అనగా నిజమైన అధికారం నుండి) ఇవ్వబడిన అధికారం” అని యేసు చెప్పాడు. అది తక్కువ  కాదు గాని ఎక్కువ అధికారంతోనే కూడుకున్నది.

అందుచేత, ఇది ఏ విధంగా భయపెట్టకుండ ఉంటుంది? యేసును చంపడానికి మాత్రమే అధికారం కాదు గాని ఆయనను చంపడానికి పిలాతుకు దేవుని ద్వారానే  అధికారం ఇవ్వబడింది.

ఈ అధికారం యేసును భయపెట్టలేదు, ఎందుకంటే యేసుపై పిలాతు కలిగియున్న అధికారం పిలాతుపై దేవుడు కలిగియున్న అధికారానికి లోబడి ఉంటుంది. ఈ సమయంలో పిలాతు శక్తి లేనివాడని కాదు కానీ పిలాతు తన ఇష్ట ప్రకారంగా చేయడానికి నడిపించబడుతున్నాడు కాబట్టి యేసు ఆదరణ పొందుతున్నాడు. పిలాతు చేతిలో యేసు ఉన్నందున కాదు గాని యేసు తండ్రి చేతిలో పిలాతు ఉన్నందున పిలాతుకున్న ఆధికారం యేసును భయపెట్టలేదు.

అంటే, మన ఆదరణ (ఓదార్పు) అధికారం లేనటువంటి మన శత్రువులనుండి రాదు గాని ఈ ఆధికారం మీద మన తండ్రి యొక్క సార్వభౌమాధికార పాలన నుండి వస్తుంది.

ఈ విషయం గురించే రోమా 8:35-37 వచనాలలో చెప్పబడింది. శ్రమయైనను బాధయైనను హింసయైనను కరువైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను క్రీస్తు నుండి వేరు చేయలేవు, ఎందుకంటే “మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము”.

పిలాతు (మరియు యేసు యొక్క విరోధులందరు, మరియు మనము) ఇది చెడు కోసం జరిగిందని అనుకున్నారు. అయితే, ఇది మంచి కోసం జరగాలని దేవుడు అనుకున్నాడు (ఆది 50:20). “ఏ సమయానికి ఏమి జరగాలో ముందుగా నిర్ణయించబడిన [దేవుని] హస్తం మరియు [దేవుని] ప్రణాళికను జరిగించడానికి” దేవుడు వారికిచ్చిన అధికారంతోనే యేసు యొక్క శత్రువులందరు ఏకమయ్యారు (అపొ. కార్య 4:28). వారు పాపం చేశారు. అయితే, వారు పాపం చేసినప్పటికీ దేవుడు రక్షించాడు.

అందుచేత, దేహాన్ని మాత్రమే చంపేటువంటి మీ శత్రువుల బెదరింపులకు భయపడకండి (మత్తయి 10:28). వారు దేహాలను మాత్రమే చంపుతారని కాదు గాని (లూకా 12:4) అది మీ పరలోకపు తండ్రి యొక్క అభయ హస్తం క్రింద జరుగుతోందని తెలుసుకొని మీ శత్రువులకు భయపడవద్దు.

అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6-7)

పిలాతు అధికారం కలిగి ఉన్నాడు. హేరోదు అధికారం కలిగియున్నాడు. సైనికులు అధికారం కలిగియున్నారు. సాతాను అధికారం కలిగియున్నాడు. అయితే, వారిలో ఏ ఒక్కరు స్వతంత్రులు కారు. వారి అధికారాలన్నీ ఉత్పన్నమైనవే గాని నిజమైన అధికారాలు కాదు. ఆ అధికారాలన్నీ దేవునికి లోబడి ఉంటాయి. భయపడనవసరం లేదు. మీరు మీ సార్వభౌమాదికారియైన తండ్రికి ఎంతో విలువైనవారు. మరువబడని పక్షులకంటే మీరు ఎంతో శ్రేష్టమైనవారు.   

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...