“ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి”. (అపొ. 23:12)
పౌలుపై మెరుపుదాడి చేసే వరకు భోజనం చేయమని ఒట్టు పెట్టుకుని ఆకలితో ఉన్న వారి సంగతేంటి?
వారి గురించి మనం అపొస్తలుల కార్యములు 23:12లో చదువుతాము, “ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.” అయితే వారనుకున్నది జరగలేదు. ఎందుకు? ఎందుకంటే అనుకోని వరుస సంఘటనలు జరిగాయి.
- ఒక బాలుడు వారి కుట్రలను విన్నాడు.
- ఆ బాలుడు పౌలు సోదరి కుమారుడు.
- ఆ బాలుడు పౌలుకు కాపలాగా ఉన్న రోమాసహస్రాధిపతి వద్దకు ధైర్యంగా వెళ్ళగలిగాడు.
- ఆ బాలుడు మాటలను సహస్రాధిపతి తీవ్రంగా పరిగణించి ట్రిబ్యూనల్‌కు తీసుకువచ్చాడు.
- ట్రిబ్యూనల్ అతనిని నమ్మి, పౌలును సురక్షితంగా తీసుకెళ్లడానికి “రెండు వందల మంది సైనికులను, డెబ్బై మంది గుర్రపురౌతులను మరియు రెండు వందల ఈటెలవారిని” సిద్ధం చేసింది.
ఆ సంఘటనలలో ప్రతి ఒక్కటి అలా జరగడం అసంభవం. వింత. కానీ అవన్నీ జరిగాయి.
ఆకస్మికంగా పడి చంపాలనుకున్న ఆకలితో ఉన్న పురుషులు ఏ విషయాన్ని విస్మరించారు? వారు తమ పన్నాగం పన్నడానికి ముందు పౌలుకు ఏమి జరిగిందో లెక్కించడంలో విఫలమయ్యారు. ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను.” (అపొ. 23:11).
పౌలు రోమాకు వెళ్తాడు అని క్రీస్తు చెప్పాడు. అదే జరిగింది. క్రీస్తు వాగ్దానానికి వ్యతిరేకంగా ఏ దొంగదెబ్బ నిలబడదు. అతను రోమాకు వచ్చే వరకు పౌలు అమరుడు. అక్కడ తన తుది వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. మరియు పౌలు ఆ విధంగా చేయుటకు క్రీస్తు సహాయం చేస్తాడు.
మీరు ఇవ్వడానికి కూడా చివరి సాక్ష్యం ఉంది. మరియు మీరు దానిని ఇచ్చే వరకు మీరు చావులేని వారే.