“అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను”. (హెబ్రీ 11:17)
ప్రస్తుతం మీలో చాలా మందికి – మరియు మీలో ఇతరులకు ఒక సమయం రాబోతోంది – దేవునికి విధేయత చూపించాలంటే మనము కన్న కలలన్నీ ముగిసిపోయాయి అనిపిస్తుంది. దేవుని వాక్యం లేదా దేవుని ఆత్మ మిమ్మల్ని చేయమన్నది మీరు చేసినట్లయితే, దుఃఖమే మిగులుతుందని మరియు దేవుడు దానిని మంచిగా మార్చలేడని మీరు భావించవచ్చు.
బహుశా మీరు ఇప్పుడే వింటున్న దేవుని ఆజ్ఞ లేదా పిలుపు ఏమిటంటే వివాహం చేసుకోవడం లేదా ఒంటరిగా ఉండడం, ఆ ఉద్యోగంలో ఉండడం లేదా ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడం, బాప్తిస్మము పొందడం, ఉద్యోగం చేసే చోట క్రీస్తు గురించి మాట్లాడడం, మీ నిజాయితీ ప్రమాణాల విషయంలో రాజీపడేందుకు నిరాకరించడం, పాపంలో ఉన్న వ్యక్తిని ఎదుర్కోవడం, కొత్త వృత్తిని చేపట్టడం, మిషనరీగా ఉండటం. మీ పరిమితమైన మనస్సులో ఇలా చేయడానికి భయపడుతున్నారు – ఒక్కగానొక్క వారసుడైన ఇస్సాకుని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది.
అన్ని కోణాలనుంచి ఆలోచించిన తరువాత ఇలా విధేయత చూపడం వలన అంతా బాగుండడం అసాధ్యం అనిపిస్తుంది.
అబ్రహాముకి అది ఎలా ఉందో ఇప్పుడు మీకు అర్ధమై ఉంటుంది. ఈ కథ మీ కోసమే బైబిల్‌లో ఉంది.
మీరు దేవుణ్ణి, ఆయన మార్గాన్ని మరియు ఆయన వాగ్దానాలను అన్నింటికంటే ఎక్కువగా కోరుకుంటున్నారా? దేవుడు తనను తాను మీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. తద్వారా మీ విశ్వాసాన్ని, విధేయతను ఘనపరచగలడని మీరు నమ్ముతున్నరా? దేవుడు తన జ్ఞానాన్ని, శక్తిని మరియు ప్రేమను ఉపయోగించి మీ విధేయత మార్గమును ఆనందం, జీవం గల మార్గంగా మార్చగలడని నమ్ముతున్నారా?
అదే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం: మీరు దేవున్ని కోరుకుంటున్నారా? మీరు ఆయన్ని నమ్ముతారా? దేవుని వాక్యం మీకు చెప్పే విషయమేమిటంటే: దేవుడు యోగ్యుడు మరియు దేవుడు సమర్థుడు.