“మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి”. (1 పేతురు 2:24)

పశ్చాత్తాపపడిన (మారుమనస్సు పొందిన) క్రైస్తవ సోదరీ సోదరుల మీద మనం కక్షలు పెట్టుకోకపోవడానికి ఆధారం ఏమిటి?

బాధ పరిచిన వ్యక్తి క్రైస్తవుడైనంత మాత్రాన మనపై మోపిన ఘోరమైన నేరాన్ని బట్టి మనకున్న నైతిక రోషం ఆవిరైపోదు. వాస్తవానికి, మనం మరింత మోసపోయామని భావించవచ్చు. “నన్ను క్షమించండి” అని ఊరకే చెప్పడమనేది ఆ నేరము ద్వారా కలిగిన బాధకు వికృతతకు ఏ రీతిగాను సరితూగదు.

అయితే, ఈ విషయంలో మనం తోటి క్రైస్తవులతో వ్యవహరిస్తున్నాం మరియు మనకు విరుద్ధంగా నేరం చేసిన వ్యక్తికి విరుద్ధంగా దేవుని ఉగ్రతకు సంబంధించిన వాగ్దానం అన్వయించబడదు, ఎందుకంటే “క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” (రోమా 8:1). “ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని [క్రైస్తవులు] ఉగ్రతపాలగుటకు నియమింపలేదు” (1 థెస్స 5:9). అంటే, వారు శిక్షను, ఉగ్రతను తప్పించుకుంటారని అనిపిస్తుంది.

న్యాయం జరుగుతుందని, క్రైస్తవ్యం పాపం యొక్క తీవ్రతను పట్టించుకోదన్నప్పుడు, మనకు మనం న్యాయం కోసం ఎవరివైపు తిరగాలి?

ఈ ప్రశ్నకు సమాధానం, మనం క్రీస్తు సిలువ వైపుకు చూడటమే. మన విషయంలో నిజమైన విశ్వాసులు చేసిన తప్పులన్నిటికి యేసు మరణంలోనే ప్రతీకారం తీర్చబడ్డాయి. ఇది వినటానికి, చెప్పడానికి చాలా సులభంగా అనిపిస్తుంది కాని దేవుని ప్రజలందరి పాపాలన్నీ యేసు మీద మోపబడ్డాయనే అద్భుతమైన వాస్తవంలో ఇదంతా ఇమిడి ఉంది. “యెహోవా మన యందరి దోషమును ఆయన మీద మోపెను” (యెషయా 53:6; 1 పేతురు 2:24).

తోటి క్రైస్తవుని ను౦డి మీరు అనుభవించిన ప్రతి బాధకు నిజమైన శిక్ష మరియు దేవుడు తిరిగి ఇచ్చే ప్రతిఫలం క్రీస్తు శ్రమయే. కాబట్టి, క్రైస్తవ్యం పాపాన్ని వెలుగులోకి తీసుకురాదు. క్రైస్తవ్యం మనము పొందిన గాయానికి అవమానాన్ని ఎంత మాత్రం జోడించదు.

దానికి బదులుగా, మనకు విరోధమైన పాపములను ఎంతో గంభీరంగా పరిగణించి, వాటిని సవరించుటకు, మనకు ఇతరులు చేసినవాటికి వారు అనుభవించునట్లు చేయకలిగిన దానికంటే ఎక్కువగా వారు అనుభవించునట్లు దేవుడు తన స్వంత కుమారుని ఎంతో శ్రమపొందజేసెను. తోటి విశ్వాసిపై మన౦ పగ చూపి౦చడ౦ కొనసాగిస్తే, దేవుని ప్రజల పాపాలకు తగిన మూల్యంగా క్రీస్తు సిలువ ఉపయోగం లేదని మన౦ చెబుతున్నా౦. ఇది క్రీస్తుకు, ఆయన సిలువకు అవమానం కానీ మీరు అలా చేయాలని కోరుకొనడం లేదు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *