నిన్ను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా చేసేది ఏది?

నిన్ను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా చేసేది ఏది?

షేర్ చెయ్యండి:

నిన్ను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా చేసేది ఏంటి? నీవు దేని వెంట పడుతున్నావు?  ఏ విషయాన్ని మీరు కలిగి ఉంటే ఎక్కువ కాలం పాటు అది మిమ్మల్ని అత్యంత ఆనందకరమైన వ్యక్తిగా చేయగలదు? 

ఈ భూమి మీద సజీవంగా ఉన్న ప్రతి మానవుడు తనకు ఆనందాన్ని కలిగించే ఒక ఊట కొరకు అన్వేషిస్తూనే ఉన్నాడు. మానవులు ఈ అన్వేషణలో ఉన్నారనే వాస్తవాన్ని బైబిల్ పూర్తిగా గుర్తిస్తుంది. అంతేకాదు ఆ అన్వేషణకు జవాబును కూడా బైబిల్ తెలియజేస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే పాస్టర్ జాన్ పైపర్ గారు పదేపదే పేర్కొనే చారిత్రాత్మకమైన నాలుగు కీలకమైన బైబిల్ వచనాలను చూడాలి. ఈ పాడ్ క్యాస్ట్ లో వేర్వేరు ధారావాహికలలో ఇప్పటివరకు ఆ వచనాలను 50 సార్ల వరకు ప్రస్తావించి ఉంటారు. ప్రతీ వచనాన్ని – అధ్యయనం చేయటం, ఒక పుస్తకంలో రాసుకోవడం, ధ్యానించటం మరియు కంఠస్థం చేయటం అనేవి ఎంతో విలువైన విషయాలు. ఆ వచనాలు ఏంటంటే కీర్తనలు 40:16; 70:4, రోమా 5:11  మరియు 1 పేతురు 3:18. దేవుని కంటే విలువైన బహుమానం ఏదీ లేదని సువార్త మనకు బోధిస్తుందని ఈ వచనాలలో ఒక్కొక్కటి తమదైన విధానములో మనకు వివరిస్తాయి. 

2017లో పాస్టర్ జాన్ గారు రికార్డ్ చేసిన ఒక చిన్న వీడియోలో పైన చెప్పిన వాటిలో ఒక రెండు వాక్య భాగాలు పేర్కొనడం జరిగింది. ఈమధ్యనే దానిని నేను కనుగొన్నాను, దానిని మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. పాస్టర్ జాన్ గారు చెప్పే మాటలు వినండి.   

ఈ రెండిట్లో మీకు ఎంతో లోతైన ఆనందాన్ని కలిగించేది ఏది? దేవుడు మీకు ఇచ్చేవా? లేక దేవుడు మీకు ఏమైయున్నాడు అనే విషయమా? మనలో మనము ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఒక విధానం ఏంటంటే, “ఏసుప్రభు నా కొరకు ఎందుకు మరణించి తిరిగి లేచాడు?” అని ఆలోచించటమే. “నా పాపాలను క్షమించటానికి, దేవుని ఉగ్రత నుండి నన్ను తప్పించడానికి,  మరియు నరకము నుండి నన్ను కాపాడటానికి, నాకు దేవుని నీతిని ఆపాదించడానికి, పరలోక ప్రవేశాన్ని నాకు అనుగ్రహించడానికి, మృతతుల్యమైన నా శరీరాన్ని పునరుత్థానములో తిరిగి లేపటానికి మరియు కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి నన్ను తీసుకెళ్లి అక్కడ నా ప్రతీ భాష్ప బిందువును తుడవటానికి” అంటూ ఈ విధమైన ఎన్నో మహిమగల కారణాలను జవాబుగా చెప్పవచ్చు. ఇవన్నీ సరైన సమాధానాలే మరియు మహిమగల సత్యాలే. వీటిని బట్టి మనం ఎంతగానో ఆనందించాలి. అయినప్పటికీ ఇవేవీ కూడా ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడు అన్న ప్రశ్నకి అంతిమమైన కారణాలు కావు. 

“దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి మనల్ని దేవుని సహవాసంలోకి తీసుకురావడం కోసమే క్రీస్తు మన కొరకు మరణించాడు.”

“మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు… పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను.” అని  1పేతురు 3:18-19 చెబుతుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కాబట్టే మనల్ని దేవుని సహవాసంలోకి తీసుకురావడానికి క్రీస్తు మన కొరకు మరణించాడు (కీర్తనలు16:33), మరియు మన విమోచన కొరకు ఆయన చేసిన కార్యములన్ని     
ఆ గమ్యాన్ని చేర్చడం కోసమే చేశాడు.

కీర్తనలు 40:16లో “నీ రక్షణ ప్రేమించువారు యెహోవా గొప్పవాడు అని అందురు గాక” అని చెప్పబడింది. కానీ “నీ రక్షణ ప్రేమించు వారు నీ రక్షణ గొప్పది అని అందురు గాక” అని చెప్పబడలేదు. తప్పకుండా మనకు ఇవ్వబడిన రక్షణ గొప్పదే, దానిని ప్రేమించాలి, గొప్పదిగా భావించాలి. మనం దేవుని తెలుసుకోవటానికి, ప్రేమించడానికి, ఆయనను ఎంతో విలువైన నిధిగా ఎంచటానికి, ఆయనయందు సంతృప్తి చెందడానికి – మనకి రక్షణ మరియు వరాలు అనుగ్రహించబడ్డాయి.

“నా అంతిమమైన మరియు లోతైన ఆనందానికి మూలం’’ అనే ప్రశ్నకు వాక్యానుసారమైన జవాబు ఏమిటి? అది దేవుడిచ్చే వరాలు కాదు. ఆ వరాల ద్వారా ఆయనను తెలుసుకోవటం, ఆయనను ఆనందించడం చేస్తాను కానీ నా ఆనందానికి అంతిమమైన మూలము మాత్రము దేవుడే. 

 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...