మిమ్మల్ని ఎక్కువగా సంతోష పెట్టేది ఏమిటి?
మిమ్మల్ని ఎక్కువగా సంతోష పెట్టేది ఏమిటి? మీ జీవితంలో వేటిని వెదుకుతున్నారు? మీరు పొందుకున్న వాటిలో, ఎక్కువ కాలం మిమ్మల్ని ఆనందకరమైన వ్యక్తిగా మార్చే ఒక ప్రధానమైన విషయం ఏమిటి?
ఈ భూమి మీద ఊపిరి ఉన్న ప్రతి మనిషి ఆనందము యొక్క మూలాన్ని వెతుకుతున్నాడు.
బైబిల్ అంతటిలో కూడా ఈ వెదుకులాటను చూడగలం. బైబిల్ ఈ అన్వేషణకు జవాబు కూడా ఇస్తుంది.
ఇది ఎలాగో చూడడానికి పాస్టర్ జాన్ గారు బైబిల్ లోని కొన్ని కీలకమైన వచనాలను, ప్రత్యేకించి నాలుగు వచనాలను–ఇప్పటివరకు, ఈ పోడ్కాస్ట్ లో, దాదాపు 50 సార్లు, పదే పదే ప్రస్తావించారు.
ప్రతి ఒక్క వచనం లోతుగా ధ్యానించదగినది, ఒక జర్నల్లో రాయదగినది మరియు కంఠత చేసేంత విలువైనది. అవి: కీర్తనలు 40:16; 70:4; రోమా 5:11, 1పేతురు 3:18. ప్రతి ఒక్క వచనం సువార్త బహుమానం దేవుడే అని, వేర్వేరు విధానములో తెలియజేస్తుంది.
పాస్టర్ జాన్ గారు, 2017లో రికార్డ్ చేసిన చిన్న వీడియోలో, ఈ రెండు వచనాలు చూడగలం. ఇటీవలే ఆ ఆడియో నాకు దొరికింది మరియు పాస్టర్ జాన్ గారు చెప్పిన ఆ విషయాలు మీకోసం ఇక్కడ పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను.
ఇప్పుడు పాస్టర్ జాన్ గారు (మాట్లాడుతారు)
మీ ఆనందానికి లోతైన మూల కారణం ఏంటి? దేవుడు మీకు ఏమిస్తాడు అనేది మీ ఆనందానికి కారణమా? లేదా దేవుడు మీకేమై ఉన్నాడు అనేది కారణమా? యేసు ప్రభువు నా కొరకు ఎందుకు చనిపోయారు మరియు ఎందుకు తిరిగి లేచారు అని నిన్ను నీవు అడగడం వల్ల ఈ ప్రశ్నకు సమాధానం దొరకుతుంది.
నిస్సందేహంగా, “నా పాపాలను క్షమించడానికి, దేవుని ఉగ్రతను తీసివేయడానికి, నరకం నుండి నాకు విడుదలనివ్వడానికి, నాకు తన నీతిని దయచేయడానికి, నేను పరలోకానికి వెళ్లడానికి, నా దేహము మరణం నుండి లేపబడడానికి, నేను క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోకి ప్రవేశించడానికి మరియు ప్రతిభాష్పభిందువును తుడిచివేయబడడానికి, యేసు ప్రభువు మరణించాడు అనే మహిమకరమైన జవాబులు కూడా ఉన్నాయి.
ఇటువంటి జవాబులు సరైనవే మరియు మహిమకరమైన సత్యములే. వీటిలో మనం ఆనందించాలి కూడా. కానీ, ఆయన చనిపోవడానికి గల అంతిమ కారణం వీటిలో ఏదీ కాదు.
1 పేతురు 3:18 లో, “క్రీస్తు… మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపము విషయములో ఒక్క సారే శ్రమపడెను.” ఆయన, మనల్ని దేవుని యొద్దకు తేవడానికి మరణించాడు. ఎందుకంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు (కీర్తనలు 16:11) అని చదువుతాం. రక్షణ విమోచనకు సంబంధించిన ఇతర కార్యాలన్నీ దేవునితో సహవాసం కలిగియుండడానికి సాధనాలుగా పనిచేస్తాయి.
కీర్తన 40:16 లో, “నీ రక్షణ ప్రేమించువారు-యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక” అని ఉంది.
“నీ రక్షణ ప్రేమించువారు నీ రక్షణ గొప్పదని చెప్పుకొందురుగాక,” అని లేదు కాని, “యెహోవా మహిమపరచబడును గాక” అని ఉంది.
నిస్సందేహంగా మన రక్షణ గొప్పదే, మరియు మనం దానిని గొప్పగానే ప్రేమించాలి. కాని ప్రాముఖ్యంగా, మనం రక్షించబడడానికి మరియు దేవుని బహుమతులన్నీ మన వద్దకు రావడానికి గల కారణం ఏమిటంటే–మనము దేవున్ని తెలుసుకోవాలని దేవున్ని ప్రేమించాలని, దేవున్ని ప్రశస్తమైన నిధిగా ఎంచాలని మరియు దేవునిలో సంతృప్తి చెందాలని.
కాబట్టి, “నా ఆనందానికి లోతైన మూల కారణము ఏమిటి ?” అనే ప్రశ్నకు వాక్యానుసారమైన జవాబు, ఆయన బహుమానాలు కావు, ఆయనే, ఆయన బహుమానాల ద్వారా ఆయనను ఎరుగుట మరియు ఆయనలో ఆనందించడమే నా ఆనందానికి మూలకారణము.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web