మరణానికి యేసు ఏమి చేశాడు?

మరణానికి యేసు ఏమి చేశాడు?

షేర్ చెయ్యండి:

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును”. (హెబ్రీ 9:27-28)

యేసు మరణం పాపాలను మోస్తుంది. ఇదే క్రైస్తవ్యానికి, సువార్తకు, లోకంలో దేవుని విమోచన గొప్ప కార్యానికి కేంద్రమై ఉన్నది. క్రీస్తు మరణించినప్పుడు ఆయన మన పాపాలను తన మీద వేసుకొని భరించాడు. ఆయన తన పాపాల కోసం కాక ఇతరులు చేసిన పాపాలను వారి పాపాలనుండి విడిపించబడడానికి భరించాడు.

ఈ సమస్య మీకు పెద్ద సమస్యగా అనిపించినా అనిపించకపోయినా మీ జీవితంలో ఉన్నటువంటి అతిగొప్ప సమస్యకు ఇదే జవాబు: మనం పాపులుగా ఉండి కూడా దేవునితో సరియైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండగలమనే ప్రశ్నకు జవాబు ఉంది. ఆ జవాబు ఏంటంటే “అనేకుల పాపాలను మోయడానికి” ఇవ్వబడిన అర్పణయే క్రీస్తు మరణం. ఆయన మన పాపాలను మోసికొని, వాటిని సిలువ మీద భరించాడు, మనం చనిపోవాల్సిన స్థానంలో ఆయన మరణించాడు.

నేను చనిపోవాలి అంటే ఏంటి? “[నేనైతే] ఒక్కసారే చనిపోవడానికి నియమించబడి ఉన్నాను.” అంటే, నా మరణమింక శిక్షార్హమైనది కాదని అర్థం. నా మరణం ఇక నా పాపానికి శిక్ష కాదని అర్థం. క్రీస్తు మరణం ద్వారా నా పాపం “తొలగించబడింది.” నేను పొందవలసిన శిక్షను క్రీస్తు పొందాడు.

అలాంటప్పుడు, నేనెందుకు మరణించాలి? పాపం అనే తీవ్రమైన భయానికి స్థిరమైన సాక్ష్యంగా, ప్రస్తుతానికి లోకంలోనూ, తన పిల్లల మధ్యనూ మరణముండాలన్నది దేవుని ఇష్టం. మన మరణంలో మనమిప్పటికీ లోకంలో ఉన్నటువంటి పాపం యొక్క బాహ్య ప్రభావాలను (పరిణామాలన్నీ) వ్యక్తపరుస్తున్నాం. అయితే, దేవుని పిల్లలకు కలిగే మరణం వారికి విరుద్ధంగా వచ్చే దేవుని ఉగ్రత కాదు. ఆ మరణమిప్పుడు శిక్షావిధి కాదు గాని రక్షణలోనికి ప్రవేశ ద్వారంగా మారింది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...