మీ దేహము యొక్క ఉద్దేశ్యం?

మీ దేహము యొక్క ఉద్దేశ్యం?

షేర్ చెయ్యండి:

“విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. (1 కొరింథీయులు 6:20)

ఈ కనబడే భౌతిక విశ్వాన్ని దేవుడు ఏ ఉద్దేశ్యం లేకుండా సృష్టించలేదు. అనేక మార్గాలలో దేవుని కీర్తి బాహాటంగా ప్రదర్శించబడడమే ఆయనకున్న ఒక ఉద్దేశ్యం. ” ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్తన 19:1).

పైన చెప్పిన విధంగా భౌతికమైనవి దేవుడు ఎందుకు సృష్టించాడో అందుకే మన దేహములు కూడా సృజించబడ్డాయి. మానవులు మరియు మానవ దేహముల ద్వారా తనను తాను మహిమ పరుచు కోవడమనే తన ప్రణాళిక విషయంలో ఆయన వెనక్కి తగ్గడు.

క్షయమైన పాపమరకలు గల మన శరీరాలకు పునరుత్థానమును ప్రసాదించి మహిమ శరీరాలుగా మరణము లేని దేహాలుగా చేయడానికి దేవుడు తన చేతులను మురికి చేసుకోవడానికి ఎందుకు అన్ని ఇబ్బందులు పడ్డాడు? సమాధానం: ఎందుకంటే భౌతిక విశ్వం ద్వారా తండ్రియైన దేవునికి మహిమ రావడమే ఆయన యొక్క ఉద్దేశ్యం.  మన శరీరాల ద్వారా కూడా ఆయనకు నిత్య మహిమ రావాలని ఆయన కుమారుడు మరణం యొక్క మూల్యాన్ని చెల్లించాడు.

ఆ వచనం ఇలా చెబుతోంది: “విలువపెట్టి కొనబడినవారు[అంటే, ఆయన కుమారుని మరణం] గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” దేవుడు తన కుమారుడు చేసిన పనిని విస్మరించడు లేదా అగౌరవపరచడు. దేవుడు మన శరీరాలను మృతులలో నుండి లేపడం ద్వారా తన కుమారుని పనిని గౌరవిస్తాడు మరియు నిత్యం ఆయనను మహిమపరచడానికి మన శరీరాలను ఉపయోగిస్తాము.

అందుకే నీకు ఇప్పుడు దేహము ఉంది. అందుకే క్రీస్తు మహిమ శరీరంలానే మన దేహము కూడా పునరుత్థానం చెందుతుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...