క్రొత్త నిబంధన గురించి క్రొత్త సంగతి ఏంటి?

క్రొత్త నిబంధన గురించి క్రొత్త సంగతి ఏంటి?

షేర్ చెయ్యండి:

“ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే”. (యిర్మీయా 31:33)

ప్రేమ మరియు ఆజ్ఞలు మధ్య ఉన్న ఎడబాటును యేసు బద్దలుకొట్టాడు.

“మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు….. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను” (యోహాను 14:15, 21). “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.” (యోహాను 15:10). 

ఆజ్ఞలు మరియు విధేయత అనే మాటలను గురించి ఆలోచించడమనేది యేసు తన త౦డ్రి ప్రేమను అనుభవి౦చడ౦ ను౦డి ఆయనను ఆపలేదు. ఆయనను ఆజ్ఞాపించేవాడిగా మనం ఆయనను గురించి ఆలోచించడం వలన ఆయనతో మనకున్న ప్రేమ సంబంధానికి భంగం కలగదని ఆయన అనుకుంటాడు.

యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనం కలిగియున్న క్రొత్త నిబంధన సంబంధమనేది ఆజ్ఞలులేని నిబంధన కాదనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవునిచేత ఇవ్వబడిన పాత నిబంధనకు మరియు క్రీస్తు ద్వారా దేవునిచేత ఇవ్వబడిన క్రొత్త నిబంధనకు మధ్యనున్న ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే ఒకదానికి ఆజ్ఞలు ఉన్నాయని, మరొక దానికి ఆజ్ఞలు లేవని కాదు. 

ముఖ్య వ్యత్యాసాలు ఏంటంటే (1) మెస్సయ్యా, యేసు వచ్చి క్రొత్త నిబంధన రక్తాన్ని చిందించాడు (మత్తయి 26:28; హెబ్రీ 10:29) కాబట్టి, ఇకను౦డి ఆయనే ఒక క్రొత్త నిబ౦ధనకు మధ్యవర్తిగా ఉ౦టాడు, తద్వారా రక్షి౦చే విశ్వాసం, నిబ౦ధనను పాటి౦చే విశ్వాస౦ అనగా ఆయనలో కలిగియుండుటయే; (2) కాబట్టి పాత నిబ౦ధన “పాతగిలిపోయింది” (హెబ్రీ 8:13) కాబట్టి అది దేవుని క్రొత్త నిబ౦ధన ప్రజలను పాలించలేదు (2 కొరి౦థీ 3:7-18; రోమా 7:4, 6; గలతీ 3:19); మరియు (3) వాగ్దానం చేయబడిన క్రొత్త హృదయం మరియు పరిశుద్ధాత్మ శక్తి అనేవి విశ్వాసం ద్వారా ఇవ్వబడ్డాయి.

పాత నిబ౦ధనలో, యేసు వచ్చునంతవరకు దేవునికి విధేయత చూపి౦చే దయగల శక్తి సంపూర్ణంగా కుమ్మరి౦చబడి ఉండలేదు. “అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు” (ద్వితీయో 29:4). క్రొత్త నిబ౦ధన గురి౦చి క్రొత్త విషయమేమిట౦టే ఆజ్ఞలు లేవని కాదు గాని దేవుని వాగ్దాన౦ నెరవేరి౦ది! “ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే” (యిర్మీయా 31:33). “నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదను” (యెహెజ్కేలు 36:27).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...