“నేను ఉన్నాను” అని దేవుడు చెప్తున్నాడు
“రెండవ దూత – పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు”. (జెకర్యా 2:4-5)
ఎంతో బలహీనమనిపించి నేను మేల్కొన్న ఉదయ కాలాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో బలహీనమైన సందర్భాలవి. ఇలా జరిగినప్పుడల్లా ఎంతో అస్పష్టంగా తికమకగా ఉండేది. ఒక్క ముప్పు కూడా జరగలేదు. ఎవరిలోనూ ఎటువంటి బలహీనత లేదు. ఏదో తప్పు జరగబోతోందని, దానికి నేనే బాధ్యత వహిస్తాననే తెలియని ఒక బాధ నాలో ఉండేది.
ఇది సాధారణంగా చాలా విమర్శల తర్వాత జరుగుతూ ఉండేది. చాలా పెద్దదిగా మరియు చాలా ఎక్కువగా అనిపించినా అంచనా వేయబడి తప్పిపోయిన ఆఖరి గడువు తర్వాత కూడా జరిగి ఉండవచ్చు.
దాదాపు 50 ఏళ్ళపాటు అలా౦టి ఉదయ కాలాలను పరిశీలించిన తర్వాత, ప్రభువైన యేసు నా జీవితాన్ని, నేను చేస్తున్న పరిచర్యను ఎలా భద్రపరిచాడన్న విషయంలో నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఒత్తిడి నుండి పారిపోవాలన్న శోధన ఎన్నడూ గెలవలేదు, ఇప్పటికీ గెలవలేదు. ఇది మహాద్భుతం. దీన్నిబట్టి నా గొప్ప దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను.
భయమనే పక్షవాతానికి నన్ను లోనుకానివ్వకుండా, లేక పచ్చని గడ్డి అనే ఎండ మావులలోనికి పరగెత్తనీయకుండా, సహాయం కోసం కేకను మేల్కొలిపాడు, ఆ తర్వాత ఖచ్చితమైన వాగ్దానాలతో జవాబిచ్చాడు.
ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఇది ఇటీవలి కాలంలో జరిగినదే. నేను మానసికంగా బలహీనంగా ఉండి ఉదయాన్నే లేచాను. చాలా బలహీనంగా ఉన్నాను. “ప్రభువా నాకు సహాయం చేయండి. ఎలా ప్రార్ధించాలో కూడా తెలియడం లేదు” అని నేను ప్రార్థించాను.
ఒక గంట తర్వాత నేను జెకర్యా పుస్తకాన్ని చదువుతున్నాను, నేను ఏడుస్తూ సహాయం కోసం ఎదురుచూసినదానికి జవాబు రానే వచ్చింది.
“రెండవ దూత – పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములులేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు” (జెకర్యా 2:4-5).
యెరూషలేము ప్రాకారములులేని మైదానముగా ఉండునంతగా దేవుని ప్రజలకు సమృద్ధి, అభివృద్ధి ఉంటుంది. “యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున” అది ప్రాకారములులేని మైదానముగా చేయబడి, దేశమంతటా వ్యాపించిన అనేకమైన గ్రామాలవలె ఉంటుంది.
సమృద్ధి, లేక అభివృద్ధి అనేది మంచిదే గాని సంరక్షణ గురించి ఏమిటి?
ఈ విషయానికి వచ్చినప్పుడు దేవుడు 5వ వచనంలో, “నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు” అని చెప్తున్నాడు. అవును, అంతే, వాగ్దానమంటే అది. “నేను ఉందును” అని దేవుడు చెప్పే మాటే నాకు అవసరం.
అది యెరూషలేములోని బలహీన గ్రామాల విషయ౦లో నిజమైతే, అది దేవుని బిడ్డగా నా విషయంలోనూ నిజమే. ఈ విధంగానే నేను పాత నిబంధన వాగ్దానాలను దేవుని ప్రజలకు అన్వయింపజేస్తాను. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి (2 కొరింథీ 1:20). క్రీస్తులో ఉన్నవారికి ప్రతి వాగ్దానము తరువాత “ఇంకా ఎంత” అనేది ఉండే ఉంటుంది. దేవుడు నా చుట్టూ “అగ్ని గోడ”గా ఉంటాడు. అవును. ఆయన నిన్న నేడు నిరంతరం అగ్ని గోడగా ఉన్నాడు.
అది ఇంకను ఎక్కువగా మెరుగుపరచబడుతుంది. ఆ అగ్నిగోడ లోపల ఆయన, “నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును” అని చెప్పాడు. దేవుడు తన అగ్ని రక్షణను మనకు ఇచ్చేందుకు తృప్తి కలిగి ఉండడు గాని ఆయన తన సన్నిధి యొక్క ఆనందాన్ని మనకివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. “నేను ఉందును” అని దేవుడు చెప్పే ప్రతిదానిని నేను ప్రేమిస్తున్నాను!
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web