“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే”. (1 కొరింథీ 15:10)

ఈ వచన౦లో, “వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని” అనే మొదటి భాగాన్ని తప్పుగా అర్థ౦ చేసుకోవచ్చని పౌలు గ్రహి౦చాడు. అందుకనే, “ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే” అని చెప్పాడు.

పౌలు తాను గతంలో అనుభవించిన కృపకు కృతజ్ఞత తెలియపరచడానికి విధేయతను కలిగియుండలేదు. ఆయన దాన్ని క్షణక్షణానికి, ఎప్పటికిప్పుడు వచ్చే కృపగా గుర్తించాడు. అవసరమైన ప్రతి క్షణంలోను దేవుని భవిష్యత్తు కృపా వాగ్దానంపై ఆధారపడుతున్నాడు. క్రీస్తుకు విధేయత చూపించాలనే పౌలు ఉద్దేశ౦లో, ప్రయాసపడిన ప్రతి క్షణంలోనూ, ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రయాసను పుట్టించడానికి కృప కార్యం జరిగించింది. పౌలు తాను గతంలో అనుభవించిన కృప కోసం కృతజ్ఞతగా తన పని గురించి మాట్లాడటం లేదు గానీ వాగ్దానం చేయబడిన కృప మీద క్షణక్షణం ఆధారపడి ఉన్నాడు. ఎల్లప్పుడూ అనుగ్రహించబడే దేవుని కృపే తన సేవకు నిర్ణయాత్మక కారణమని పౌలు నొక్కి చెప్పాలనుకుంటున్నాడు.

ఈ వచనం నిజంగా అలాగే చెప్తోందా? దేవుని కృప పౌలుతో  కలిసి పనిచేసిందని మాత్రమే చెప్పడం లేదా? ఆలాగు చెప్పట్లేదు గాని ఆ వచనం ఇంకా ఎక్కువగానే చెప్తోంది. “ప్రయాస పడినది నేను కాను” అనే మాటలు మనం చెప్పాలి. పౌలు తాను చేయుచున్న సేవను ఆయనే నిర్ణయాత్మకంగా చేయడం లేదని స్పష్టంగా చెప్తూ, ఆయన క్షణక్షణం దేవుని కృపను మహోన్నతంగా ఉంచాలని కోరుకుంటున్నాడు.

ఏదేమైనా, “వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని” అని చెప్పినట్లుగా ఆయన తన పనిని జరిగించి, ప్రయాసపడ్డాడు. అయితే, ప్రయాసపడింది “నాకు తోడై ఉన్న” దేవుని కృపయే అని చెప్పాడు.

ఈ వచనంలోని అన్ని భాగాలను నిలబెడితే, పౌలు పనిలో నిర్ణయాత్మకమైనది కృపయే అని అంతిమ ఫలితంగా ఉంటుంది. పౌలు కూడా తన పనిని చేసేవాడే కాబట్టి, పౌలు చేయు పనులను బలపరచే శక్తిగా కృప మారినప్పుడు అది నిర్ణయాత్మకమైన పని చేసేదిగా మారుతుంది.

నేను దీనిని ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, పౌలు ప్రతి రోజూ సేవా భారాన్ని ఎదుర్కొ౦టున్నప్పుడు, ఆయన శిరస్సు వంచి, ఆ రోజుకు కావాల్సిన సేవకు సరిపడా భవిష్యత్తు కృపను ఇవ్వకపోతే, తాను దానిని చేయలేనని ఒప్పుకున్నాడని అర్థం చేసుకుంటున్నాను.

“నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు” (యోహాను 15:5) అని యేసు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకుని ఉండవచ్చు. అందుచేత, ఆ రోజుకు కావాల్సిన భవిష్యత్తు కృప కోసం ప్రార్థించాడు, మరియు అది అధికారంతో వస్తుందనే వాగ్దానాన్ని నమ్మాడు. “దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ 4:19).

ఆ తర్వాత, ఆయన తనకున్న శక్తినంతటితో నడుచుకున్నాడు. 

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *